ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 28 డిశెంబరు 2022 (15:03 IST)

దూసుకుపోతున్న అవతార్... ప్రపంచ బాక్సాఫీస్‌లో సరికొత్త రికార్డులు

Avatar Movie
జేమ్స్ కామెరూన్ తెరకెక్కించిన అపురూప గ్రాఫిక్స్ చిత్రం "అవతార్-2". ఈ నెల 16వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. ఈ చిత్రం విడుదలైన కేవలం 12 రోజుల్లో రూ.8200 కోట్ల మేరకు కలెక్షన్లు రాబట్టింది. అంటే ప్రపంచ వ్యాప్తంగా ఒక బిలియన్ డాలర్ల మేరకు కలెక్షన్లు వచ్చినట్టు సినీ విశ్లేషకుల సమాచారం. 
 
అయితే, ఈ స్థాయిలో కలెక్షన్లు రాబడుతున్నప్పటికీ చిత్ర నిర్మాతలు మాత్రం లాభాలు కళ్ల చూడలేదు. లాభాలు చూడాలంటే రూ.16400 కోట్ల వసూలు చేయాల్సివుంది. అంటే ఇప్పటివరకు కేవలం సగం కలెక్షన్లు మాత్రమే రాబట్టింది. అయితే, "అవతార్" సినిమాకు ఉన్న ప్రత్యేక దృష్ట్యా మరో బిలియన్ డాలర్ల కలెక్షన్లను సులభంగానే రాబడుతుందని సినీ ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
 
ఇప్పటివరకు వసూలైన ఒక్క బిలియన్ డాలర్లలో 300 బిలియన్ డాలర్లు ఒక్క నార్త్ అమెరికాలో వసూలు కాగా మిగిలిన 700 డాలర్లు ప్రపంచ వ్యాప్తంగా వసూలైంది. మన దేశంలోనూ ఈ సినిమా రూ.300 కోట్లకుపైగా వసూళ్ళను రాబట్టిన విషయం తెల్సిందే.