ఆదివారం, 24 సెప్టెంబరు 2023
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 13 డిశెంబరు 2022 (12:41 IST)

అవతార్‌2కు అవసరాల అవసరం వచ్చింది

avasarasala Srinivas
avasarasala Srinivas
హాలీవుడ్‌ సినిమా అవతార్‌ గురించి తెలిసిందే. 2009లో వచ్చిన ఈ సినిమాకు ఇప్పుడు సీక్వెల్‌ వచ్చేస్తుంది. డిసెంబర్‌ 16న విడుదలకు సిద్ధమైంది. దాదాపు ప్రపంచంలోని ఎక్కువ భాషల్లో డబ్బింగ్‌ అవుతున్న అవతార్‌2 ద వే ఆఫ్‌ వాటర్‌ను తెలుగులో కూడా అనువదిస్తున్నారు. కాగా, ఈ తెలుగు భాష తర్జుమాకు అవసరాల అవసరం వచ్చింది. నటుడు, శాస్త్రవేత్త, దర్శకుడు, రచయిత అయిన అవసరాల శ్రీనివాస్‌ తనదైన శైలిలో ఆంగ్లాన్ని తెలుగులో నేటివిటీకి అనుగుణంగా మాటలు రాస్తున్నారు. ఈ విషయాన్ని షేర్‌ చేస్తూ ఆనందాన్ని వ్యక్తం చేశారు.
 
అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న మాగ్నమ్‌ ఓపస్‌ అవతార్‌2 ద వే ఆఫ్‌ వాటర్‌కు నేటివిటీ ఎమోషన్‌ను సరిపోల్చడానికి నాకు అవకాశం వచ్చింది. మన స్వంత భాషలో థియేటర్లలో విజువల్‌ వండర్‌ను అనుభవించడానికి సిద్ధంగా ఉండండి అంటూ పేర్కొన్నారు. ఈ చిత్ర సష్టికర్త జేమ్స్‌ కేమరూన్‌. ఈరోజు హాలీవుడ్‌ లో అవతార్‌2 ప్రివ్యూ వేస్తున్నారు.