గురువారం, 19 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 13 డిశెంబరు 2022 (10:35 IST)

"ముత్తువేల్ పాండియన్‌"ను పరిచయం చేసిన 'జైలర్' యూనిట్

jailer movie trailer
సూపర్ స్టార్ రజనీకాంత్ తన 72వ పుట్టినరోజు వేడుకలను సోమవారం జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన నటిస్తున్న "జైలర్" చిత్రం నుంచి ఆయన పాత్రను పరచియం చేస్తూ ఒక స్పెషల్ పోస్టరును రిలీజ్ చేశారు. ఇందులో ఆయన "ముత్తువేల్ పాండియన్" అనే పాత్రను పోషిస్తుండగా, ఈ పోస్టర్ ద్వారా ఆ పాత్రను పరిచయం చేశారు. రజనీ మార్క్ స్టైల్‌లో ఈ పోస్టర్‌లో కనిపిస్తున్నారు. 
 
సన్ పిక్సర్స్ బ్యానరుపై భారీ బడ్జెట్‌తో నిర్మాత కళానిధి మారన్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి యంగ్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం సమకూర్చుతున్నారు. 
 
ఈ చిత్రం ఒక జైలు చుట్టూ తిరిగే కథ అనీ, జైలర్ చుట్టూ తిరిగే కథ అని తెలుస్తోంది. చాలాకాలం తర్వాత రజనీకాంత్, రమ్యకృష్ణ కాంబినేషన్‌ను వెండితెరపై చూపించనున్నారు. దీంతో సినిమాపై అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి.