సుదీర్ఘంగా సాగే మాయాజాలమే అవతార్-2 రివ్యూ
ఇదే డిసెంబర్18న 2009లో 13 ఏళ్ళనాడు విడుదలైన అవతార్ సినిమా ఆ టైంలో విజువల్ వండర్స్ ప్రేక్షకులకు ఓ ఫీల్‌ను కలిగించాయి. ఆ తర్వాత పెరిగిన సాంకేతికతతో ఇదే డిసెంబర్ 16న 2022లో అవతార్2 విడుదలయింది. జేమ్స్ కామెరాన్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకు టికెట్స్ బుకింగ్ ఓపెన్ అనగానే ప్రపంచంలో విపరీతంగా అమ్ముడయ్యాయి. అందులో పర్యావరణంపై సాగిన పోరాటంగా మొదటి అవతార్‌లో చూపించారు. మరి ఈ రెండో పార్ట్ వాటర్‌లో యుద్ధంగా టైటిల్‌లోనే పెట్టేశారు. 3డి సినిమాగా రూపొందిన ఈ సినిమా సుదీర్థకథ 3గంటల 12 నిముషాలపాటు సుదీర్ఘంగా సాగింది. మరి అదెలా వుందో చూద్దాం.
కథలోకి వెళితే.
మొదటి భాగం అవతార్‌లో మనుషులకు దూరంగా ఓ అందమైన ప్రకృతిమధ్య పాండోరా అనే విలేజ్‌లో నావీ అనే చిత్రమైన జాతి వుందని తెలిసి అక్కడి వనరులను ఆక్యుపై చేయడానికి మిలట్రీ దళం దాడి చేస్తుంది. ఇక పాండోరా జాతి మనుషులు కోతితరహా తోకతో బ్లూ కలర్‌తో వుంటారు. వారికి కొన్ని శక్తులు వుంటాయి. దానికి సంకల్ప బలం తోడయి పోరాటానికి వచ్చిన మనుషులను దాడిచేసి తనదే పై చేయిగా చేసుకుంటారు. ఈ విజయంలో ఓ వ్యక్తిది కీలక పాత్ర. ఇక్కడ ట్విస్ట్ ఏమంటే. ఓ మనిషి పాండోరా జాతిలోకి మారిపోయి జాక్ పేరుతో వారిలో ఒకటిగా మారి నాయకత్వం వహిస్తాడు. ఇక అవతార్2లోకి వచ్చేసరికి పాండోరాలోని నావీ అమ్మాయినే పెండ్లిచేసుకుని అక్కడే వుంటున్న జాక్‌పై మిలట్రీ మనుషులు జాక్ కుటుంబానికి అంతం చేయాలని చూస్తారు. ఆ ప్రయత్నంలో ఏమి జరిగింది? అనేది మిగిలిన కథ.
ఈ అవతార్‌లో పాత్రలు, వారి తీరు మొత్తం మన పురాణాల్లోని అవతార పురుషులలాగే వుంటాయి. వాటినుంచి తీసుకున్న ఊహాజనితమైన కథను అల్లి విజువల్ వండగా తీర్చిదిద్దారు. ఇది ఏ దేశం వారికైనా కనెక్ట్ అయ్యే కథగా వుంటుంది. మనుషులు, జంతువులు, సముద్రం, చేపలు, ఎగిరే పక్షులు వంటివి వినూత్నమైన ఫీల్‌ను కలిగిస్తాయి. దేవతలు, రాక్షసులు భూలోకంలో యుద్ధం చేయాల్సి వస్తే పాల సముద్రం చిలికి ఏవిధంగా కృష్ణుడు దేవతలను రాక్షసులను వేరు చేశాడనే పాయింట్ ఈ అవతార్ కథకు సూట్ అవుతుంది. దర్శకుడు ఎక్కువగా అధునాతన సాంకేతికపైనే కాన్‌సన్ ట్రేషన్ చేశాడు.
మొత్తంగా చూస్తే, అవతార్ మొదటి పార్ట్ చూసిన కిక్ అవతార్2లో కనిపించదు. కేవలం వింతలోకం మనుషులు, సముద్రంలో యుద్ధం వంటివి పబ్లిసిటీని ఉపయోగించుకు సినిమాపై మంచి క్రేజ్ ఏర్పరిచారు. పాండేరా మనుషులు పిల్లలు, సముద్రంలో విన్యాసాలు, తిమింగళాలతో స్నేహం, వింత పుష్పాలతో గతాన్ని తెలుసుకోవడం, ఏదైనా అనారోగ్యం పాలైతే ప్రకృతినుంచి పొందిన శక్తులతో ఎలా నయం చేయవచ్చో వంటివి ఇందులో చూపించాడు. వీటికంటే మరింత ప్రధానమైంది శ్వాసమీద కంట్రోల్ వుంటే సముద్రంలో ఎంతసేపైనా అలుపులేకుండా ఈద వచ్చు అనే పాయింట్‌తో బ్రీతింగ్ ఎక్సర్‌సైజ్ ను కూడా ఇందుతో దర్శకుడు చూపించాడు. ఇది రోజువారీ మనుషులు చేసే ప్రాణాయామం లాంటిది. అవతార్2లో పాండారా జాతి మనుషుల్లో రెండు రకాలున్నారని చెప్పాడు. మొదటి పార్ట్ అవతార్‌లో కేవలం ఆకాశంలో పక్షులపై విన్యాసాలు చేయడం వాటిని కంట్రోల్ చేసే విద్యను చూపించాడు. అలాగే అడవిల్లో మనుషులు దాడిచేస్తే ఎలా ఎదుర్కొవాలో చూపించాడు.
ఇక అవతార్2లో సముద్రంలో ఎక్కువగా సేపు వుండాలంటే పాండారాలోని ఓ ప్రత్యేకజాతి వుంది. ఆ జాతి దగ్గరకు జాక్ ఫ్యామిలీ వెళ్ళినప్పుడు మీరు మా దగ్గర వుండానికి పనికిరారు. మీ చేతివేళ్ళు, బలం సముద్రంలో పక్షులపైనుంచి ఈదడానికి పనికిరాదంటూ చెబుతాడు. అంటే ఈసారి కేవలం సముద్రంపైనే ఎక్కువ ఫోకస్ చేశాడు.
ఆ ఫోకస్ వల్ల సముద్రంలో వింతలు విశేషాలు. తిమింగాలతో స్నేహం, చెలిమి, వాటితో మాట్లాడే భాష వంటికి చిత్రంగా అనిపిస్తాయి. ఆపదలో అవి పాండారా వారిని ఎలా కాపాడయనేది కూడా బాగా హైలైట్ చేశాడు. కానీ దాదాపు 3గంటలపైగా వున్న ఈ సినిమాలో కేవలం విజువల్స్, గ్రాఫిక్స్, సీజీ వర్క్ తో సముద్రంలో యుద్ధం చూసిన ఫీలింగ్ బాగానే కలుగుతుంది. టైటానిక్ తర్వాత మరలా అంతసేపు సముద్రంలో ప్రేక్షకుడు గడిపేలా చేయడం ఈ సినిమాతోనే సాధ్యమయింది.
అవతార్2 కేవలం విజువల్ వండర్‌లో ఊహాజనితమైన లోకంలో కాసేపు అలా విహరించి రావడం ప్రేక్షకుడికి కలుగుతుంది. కథ, కథనాల్లో పెద్దగా ప్రత్యేకత లేదు. కేవలం ఓ అనుభూతి కోసం చూడాలనుకునేవారు ఈ సినిమా చూడొచ్చు. అయితే, పాండారాజాతివారు ఎంతసేపు సముద్రంలో వున్నా జుట్టు రేగదు. బాడీనుంచి నీళ్ళు కారవు. ఇదంతా ఓ దశలో కార్టూన్ సినిమా చూసినట్లుగా వుంటుంది. సో. ఈ సినిమా చూడాలంటే కాస్త ఓపికచేసుకుని వెళ్ళాల్సిందే.