1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. సమీక్ష
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 16 డిశెంబరు 2022 (16:09 IST)

అవతార్ 2: ఊహాశక్తికి హద్దులేని సముద్ర ప్రపంచం... అద్భుతమైన దృశ్యకావ్యం

Avatar: The Way of Water
అవతార్ విజువల్ వండర్‌‌కు సీక్వెల్ అవతార్ 2 ప్రేక్షకుల ముందుకు వచ్చింది. జేమ్స్ కామెరూన్ దర్శకత్వంలో వచ్చిన అవతార్ సినిమా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించిన ఈ సినిమాకు ప్రస్తుతం సీక్వెల్ వచ్చేసింది. 
 
అవతార్ 2 కథ సంగతికి వస్తే... అవతార్ భూమి నుంచి పండోరా గ్రహానికి వెళ్లిన జేక్ (సామ్ వర్తింగ్‌టన్) అక్కడే ఓ తెగకి చెందిన నేతిరి (జో సల్దానా)ని ప్రేమించి వివాహం చేసుకుంటాడు. 
 
నేతిరి తండ్రి వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్న జేక్ ఆ తెగకి నాయకుడవుతాడు. పదేళ్లలో లోక్, నేటియం, టూక్ అనే ముగ్గురు పిల్లల్ని కన్న జేక్, నేత్రి దంపతులు.. దత్త పుత్రిక కిరీ, స్పైడర్ అనే మరో బాలుడితో కలిసి హాయిగా జీవిస్తుంటారు. 
 
ఇంతలో భూ ప్రపంచం అంతరించిపోతుందని.. ఎలాగైన పండోరాని ఆక్రమించి అక్కడున్న నావీ తెగని అంతం చేయాలని మనుషులు మరోసారి సాయుధబలగాలతో దండెత్తుతారు.
 
అక్కడి ప్రజలకు సముద్రమే ప్రపంచం. ఎలాగైనా జేక్‌ని అతడి కుటుంబాన్ని మట్టుబెట్టాలని భూమి నుంచి వచ్చిన ప్రధాన శత్రువు మైల్స్ క్వారిచ్ (స్టీఫెన్ లాంగ్) అతడి బృందంతో పోరాడటమే మిగిలిన కథ. 
 
విశ్లేషణ.. 
తొలి భాగం పండోరా గ్రహంలోని సుందరమైన అటవీ, జీవరాశుల ప్రపంచం చుట్టూనే సాగుతోంది. కామెరూన్ మరో దృశ్యకావ్యాన్ని తెరపై ఆవిష్కరించారు. తన ఊహాశక్తికి హద్దు లేదని చాటి చెప్తూ.. సముద్ర గర్భంలో మరో అందమైన ప్రపంచం వుందని జేమ్స్ నిరూపించాడు.