బుధవారం, 27 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : మంగళవారం, 11 మే 2021 (16:38 IST)

రాజ‌ముడి రైస్‌తో రోగాల‌కు చెక్ పెట్టండిః పూరీ

puri musings
ద‌ర్శ‌కుడు పూరీ జ‌గ‌న్నాథ్ పూరీ మ్యూజింగ్స్ పేరుతో ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాల‌ను తెలియ‌జేస్తున్నారు. అందులో భాగంగా ఈరోజు రాజ‌ముడి రైస్ గురించి మాట్లాడారు. అస‌లు మ‌న‌దేశంలో ఒక‌ప్ప‌డు ల‌క్ష గ్రేన్‌ల‌ను పండించేవారు. రైతు చ‌నిపోతే వారి పిల్ల‌లు ఆ పంట‌ను పండించ‌లేరు. అలా కొన్ని వేల రైసులోని ర‌కాలు మాయ‌మ‌య్యాయి. అందుకే వాటి గురించి పూరీ ఏమంటున్నారో చూద్దాం.
 
'ఇండియాలో రైస్ ముఖ్యమైన ఆహరం. బాస్మతి, అన్నపూర్ణ, చంప, హన్సరాజ్, మొలకొలుకులు, పూస, సోనామసూరి, జాస్మిన్, సురేఖ ఇలా కొన్ని మాత్రమే మనకు తెలుసు. ఒకప్పుడు ఇండియాలో ఒక లక్ష వెరైటీ రైస్ ఉండేవి. ఒక రకం రైస్ ను పండించే రైతు చనిపోతే అది ప్రపంచంలో నుంచి మాయమైపోతుంది. ఎందుకంటే వాళ్ళ పిల్లలు దాన్ని పండించరు. పిల్లలు మర్చిపోతే అంతే. అలా  ఎన్నో రకాల వెరైటీ రైస్ మాయం అయిపోయాయి. తరువాత 40వేల‌ రకాల రైస్ మిగిలాయి. గత 50 ఏళ్ళలో అవి కూడా కనుమరుగైపోయాయి. ఇప్పుడు ఆరువేల‌ రకాల రైస్ మాత్రమే ఉన్నాయి. అందులో 'రాజముడి' రైస్ అనే రకం గురించి మీకు చెప్పాలి. 
 
కర్ణాటకలో పూర్వం పన్ను కట్టడానికి డబ్బులు లేకపోతే రాజ‌ముడి రైస్ పండించి రాజుకు క‌ట్టేవారు. అందుకే రాజుకు ఇచ్చే ముడి అని పేరుతో రాజ‌ముడి రైస్‌గా ప్రాచుర్యం పొందింది. అంతే అంత విలువైన‌ది. ఆ రైస్ గురించి నాకు విజయ్ రామ్, రామ్ బాబు అనే ఇద్దరు బ్రదర్స్ చెప్పారు. వారిద్దరూ వ్యవసాయం గురించి ఎన్నో ఏళ్ళు రీసెర్చ్ చేశారు. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్, జింక్ పుష్కలంగా ఉంటాయి. దీనివల్ల మనలో ఇమ్యూనిటీ పెరుగుతుంది. డయాబెటిక్ పేషంట్స్, ఆడవాళ్లు ముఖ్యంగా ఈ రైస్ తినాలి" అంటూ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు పూర. పూరీ ఇంకా ఏం చెప్పాడో మీరూ వినండి.
 
వీటిని కుక్క‌ర్లో వండ‌కూడ‌దు. గంజి వార్చాలి. దాన్ని తాగాలి. సూప్‌లాగా ఆర‌గించాలి. ఇది అన్ని రోగాల‌కు నివార‌ణ‌. ఇలా మంచి ఆహారాన్ని తిందాం. తెల్ల‌రైస్‌ను మ‌ర్చిపోదాం. అంటూ విలువైన స‌మాచారం తెలిపారు.