సినీ పరిశ్రమలో మరో విషాదం... నటి జయ కన్నుమూత
సినీ ఇండస్ట్రీలో మరో విషాదం.. నటి జయ ఇక లేరనే వార్త ఆమె ఫ్యాన్స్‌కు మింగుడుపడటం లేదు. గత ఏడాది నుండి సినీ ఇండస్ట్రీకి చెందిన వారి మరణాలకు సంబంధించి అనేక వార్తలు వింటున్నాం. కొందరు కరోనాతో కన్నుమూస్తుంటే మరి కొందరు అనారోగ్యంతో తుది శ్వాస విడుస్తున్నారు.
తాజాగా ప్రముఖ కన్నడ సినీ నటి బీ. జయ( 75) అనారోగ్యంతో బెంగళూరులోని కరుణశ్రమ ఆసుపత్రిలో కన్నుమూశారు. ఆరు దశాబ్దాలకు పైగా సుదీర్ఘ కరియర్‌లో హాస్య, క్యారక్టెర్ పాత్రల్లో నటించి మెప్పించిన జయ ఇక లేరనే వార్త కన్నడ చిత్ర పరిశ్రమను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది.
థియేటర్ ఆర్టిస్ట్‌గా కెరియర్ ప్రారంభించిన జయ 1958 లో భక్త ప్రహ్లాద చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేశారు. డాక్టర్ రాజ్‌కుమార్, కల్యాణ్ కుమార్, ఉదయ్ కుమార్, ద్వారకేష్, బాలకృష్ణ వంటి తొలి తరం నటులతో ఆమె నటించారు. 2004-05లో గౌడ్రూ మూవీలో నటనకు గాను జయమ్మ ఉత్తమ సహాయక నటి అవార్డు గెల్చుకున్నారు. ఆమె మృతి అభిమానులని ఎంతగానో కలవరపరుస్తుంది.