బుధవారం, 8 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Raju
Last Updated :హైదరాబాద్ , సోమవారం, 8 మే 2017 (10:28 IST)

టాలీవుడ్ థర్డ్ గ్రేడ్ ఇండస్ట్రీ అనుకున్నాం కాని ఇంత దెబ్బ కొడుతుందనుకోలేదే.. షాక్‌లో బాలీవుడ్

టాలీవుడ్.. ఇండియాలో వందలకొద్దీ తెలుగు సినిమాలను తీసే ఓ ఫిల్మ్ ఇండస్ట్రీ. బాలీవుడ్‌లోనూ నార్త్ ఇండియా మీడియాలోనూ మన సినిమా మీద అటూ ఇటూగా ఉన్న ఓపీనియన్. ఆ మాట అనే దమ్ము ఇప్పుడుందా? బాహుబలితో మహాశిఖరాలన

టాలీవుడ్..  ఇండియాలో వందలకొద్దీ తెలుగు సినిమాలను తీసే ఓ ఫిల్మ్ ఇండస్ట్రీ. బాలీవుడ్‌లోనూ నార్త్ ఇండియా మీడియాలోనూ మన సినిమా మీద అటూ ఇటూగా ఉన్న ఓపీనియన్. ఆ మాట అనే దమ్ము ఇప్పుడుందా? బాహుబలితో మహాశిఖరాలను చేరిన తెలుగు సినిమా ఘనతను తలెత్తి చూడటానికే మెడలు వంగిపోతున్నాయిప్పుడు. పైగా బాలీవుడ్ 2 జైత్రయాత్రను బాలీవుడ్ నుంచే మొదలుపెట్టారు రాజమౌళి. 
 
తెలుగు  సినిమా అంటే మాస్ మసాలా మిక్చర్ పొట్లం. ఓ రివెంజ్ డ్రామా, ఎమోషనల్ డైలాగులు, మొహం మెత్తే రంగురంగుల డ్రెస్సులు, ఆరు ఫైట్లు, ఆరు సాంగ్‌లు.. ఊ లా లా టైపు ఐటమ్ సాంగ్. ఇదీ టాలీవుడ్ అంటే హిందీ ఇండస్ట్రీకి ఒకప్పుడు ఉన్న అభిప్రాయం. మరి ఇప్పుడో.. ఒక తెలుగు సినిమా స్టామినా ముందు తలవంచడాన్ని గౌరవంగా భావిస్తోంది బాలీవుడ్. బాహుబలి-2  సినిమాను చూశాక ఎవరైనా సాహో అనాల్సిందే.వందకోట్ల వసూళ్లతో బాహుబలి ఫస్ట్ పార్ట్ హిందీ మార్కెట్లో మొదటి అడుగు వేసింది.

ఇక బాహుబలి-2 సినిమా పుట్టిందే బాలీవుడ్‌లో మొదటి రోజు 41 కోట్ల వసూళ్లతో వేట మొదలు పెట్టాడు అమరేంద్ర బాహుబలి. రెండోరోజు 40.50 కోట్లు. మూడోరోజు 46.50 కోట్ల కలెక్షన్లు. మూడు రోజుల్లో 128 కోట్ల కలెక్షన్లతో కొత్త చాప్టర్‌ని సృష్టించింది.  నాలుగో రోజు 40 కోట్లు, అయిదోరోజు 30 కోట్లు, ఆరవ రోజు 26 కోట్లు, ఏడోరోజు 22.30 కోట్లతో వారం రోజుల్లో 250 కోట్లు వసూలు చేసింది బాహుబలి-2 . 
 
బాలీవుడ్‌లో ఇది కొత్త రికార్డు. ఖాన్‌లు చూడని సరికొత్త చరిత్ర. ఒకటి ఒకటి.  మూడు మూడు. పదీ పదీ, వందకు వంద, రెండొందలు... బడిపిల్లల ర్యాంకులా అడ్వర్టయిజ్‌మెంట్లు తయారయ్యాయి బాహుబలి-2 కలెక్షన్ల ఒరవడి. బాలీవుడ్‌లో మొదటి వారం దంగల్ 197.50 కోట్లు వసూలు చస్తే, సుల్తాన్ 9 రోజులకు 229 కోట్లు వసూలు చేసింది. బాహుబలి-2 కేవలం ఏడురోజుల్లోనే 250 కోట్లు కలెక్ట్ చేసి కొత్త టార్గెట్ ఫిక్స్ చేసింది. ఫుల్ రన్‌లో బాహుబలి-2 బాలీవుడ్‌లో 400 కోట్లు ఈజీగా వసూలు చేస్తుందని అంచనా..