ఇక చైనా, జపాన్ లోనూ బాహుబలి2 జోరు.. డబ్బింగ్ సన్నాహాల్లో చిత్ర నిర్మాతలు
దక్షిణాది, ఉత్తరాది, ఆసియా దేశాలు, అమరికా, దుబాయ్, ఆస్ట్రేలియా.. ఇలా విడుదలైన ప్రతి చోటా సంచలనాత్మక విజయంతో, అద్భుతమైన వసూళ్లతో దూసుకెళుతున్న బాహుబలి2 చిత్రం మరో అద్భుతానికి తెర తీయనుంది. తెలుగు, భారత
దక్షిణాది, ఉత్తరాది, ఆసియా దేశాలు, అమరికా, దుబాయ్, ఆస్ట్రేలియా.. ఇలా విడుదలైన ప్రతి చోటా సంచలనాత్మక విజయంతో, అద్భుతమైన వసూళ్లతో దూసుకెళుతున్న బాహుబలి2 చిత్రం మరో అద్భుతానికి తెర తీయనుంది. తెలుగు, భారతీయ సినిమా అయినప్పటికీ ప్రపంచమంతటా ప్రచారంలో ఉన్న బాహుబలి2ని మరో రెండు భాషల్లోకి డబ్బింగ్ చేసి రెండు ఆసియన్ జెయింట్ దేశాలలో విడుదల చేయాలని దర్శక నిర్మాతలు రాజమౌళి, శోభు భావిస్తున్నట్లు తెలుస్తోంది.
బాహుబలి ది బిగినింగ్ మూవీని గతంలో చైనాలోకి డబ్ చేసి విడుదల చేసిన విషయం తెలిసిందే. మన సంస్కృతికి భిన్నమైన దేశం అయినప్పటికీ తొలిభాగం చైనాలో మంచి ఆదరణ పొందడంతో రెండో భాగమైన బాహుబలి-2ను చైనీస్ భాషలోకి డబ్బింగ్ చేసి చైనా ప్రేక్షకులకు చేరువ కావాలని చిత్ర నిర్మాతలు ఆలోచిస్తున్నట్లు సమాచారం. పనిలో పనిగా తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్‌కు భారీస్థాయిలో అభిమానులున్న జపాన్ లోనూ విడుదల చేస్తే బాహుబలి-2 ప్రభంజనం సృష్టించే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషకులు సూచిస్తున్నారు.
ప్రపంచవ్యాప్తంగా రికార్డుస్థాయిలో తొమ్మిది వేల స్క్రీన్లపై విడుదలైన తొలి టాలీవుడ్ చిత్రంగానూ బాహుబలి-2 రికార్డు నెలకొల్పిన విషయం తెలిసిందే. ప్రభాస్, దగ్గుబాటి రానా, అనుష్క, తమన్నా, రమ్యకృష్ణ, సత్యరాజ్, నాజర్ ప్రధాన పాత్రల్లో కనిపించిన ఈ మూవీ ఇప్పటికే రూ.800 కోట్లు కొల్లగొట్టి వెయ్యి కోట్ల క్లబ్ లో చేరనున్న తొలి భారతీయ చిత్రంగా నిలవనుందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.