శనివారం, 26 ఏప్రియల్ 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: శనివారం, 26 ఏప్రియల్ 2025 (14:21 IST)

35 తుపాకులు సిద్ధం చేసుకోండి?: గుర్రాలపై తీసుకెళ్లిన వ్యక్తి ఫోన్ సంభాషణ

pahalgam terror attack
పహల్గాం ఉగ్రవాది దాడికి సంబంధించి రోజురోజుకీ ఈ దాడి వెనుక జరిగిన కుట్ర వ్యవహారం బయటపడుతోంది. అనంత్ నాగ్ చుట్టుపక్కల ప్రాంతాలలో పర్యటిస్తున్న పర్యాటకులను పనిగట్టుకుని బైసరన్ లోయకు అయాజ్ అహ్మద్ అనే గుర్రపు స్వారీ యజమాని తీసుకువెళ్లినట్లు బాధితులు చెబుతున్నారు. ఇతడు టూరిస్టులతో జరిపిన సంభాషణ కూడా అనుమానస్పదంగా గోచరించినట్లు చెబుతున్నారు. అతడు టూరిస్టులను మతం గురించి ప్రశ్నించడంతో పాటు వారు లోయ ప్రాంతానికి వెళ్లేందుకు ఇష్టపడక పోయినా బలవంతంగా వారిని తీసుకువెళ్లినట్లు తేలింది. దీనితో అయాజ్ అహ్మద్ ను గందర్బాల్ పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.
 
35 తుపాకులు అంటూ కోడ్ భాష?
పహలగామ్ ఉగ్రవాద దాడిలో కాశ్మీరుకి వెళ్లిన 26 మంది హిందువులు ప్రాణాలు కోల్పోయారు. శుభం ద్వివేది కూడా దాడిలో మరణించారు. ఆయన కుటుంబ సభ్యులు ఆయన మృతదేహాన్ని కాన్పూర్‌కు తీసుకువచ్చారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దుఃఖిస్తున్న ద్వివేది భార్య ఐశాన్యతో పాటు ఇతర కుటుంబ సభ్యులను ఓదార్చేందుకు వచ్చారు. పహలగామ్ ఉగ్రవాద దాడిలో స్థానిక స్లీపర్ సెల్స్ కొంతమంది పాల్గొన్నారనే ఊహాగానాలకు బలం చేకూర్చే కొన్ని విషయాలను కూడా ఆమె వెల్లడించింది.
 
తను తన భర్తతో కలిసి వున్నప్పుడు గుర్రాన్ని తీసుకుని ఓ వ్యక్తి తమ వద్దకు వచ్చాడు. గుర్రపు స్వారీ చేస్తారా అని మమ్మల్ని అడిగాడు. కొద్దిసేపు ఆలోచించుకుని మాకు చాలా దూరం వెళ్లే ఉద్దేశ్యం లేదనీ, ఇక్కడిక్కడే చుట్టమని చెప్పాము. ఐతే గుర్రపు స్వారీ వ్యక్తి తమను లోయలోకి తీసుకెళ్లవద్దని చెప్పినా వినకుండా అటువైపు తీసుకెళ్లడం మొదలుపెట్టాడు. దీనితో నా భర్త అతడికివ్వాల్సిన డబ్బు మొత్తం ఇచ్చేసి మమ్మల్ని తిరిగి వెనక్కి తీసుకుని వెళ్లమని చెప్పాడు. ఐతే అతడదేమీ పట్టించుకోకుండా లోయ ప్రాంతంలో మరింత బాగుంటుందని గుర్రంపై మమ్మల్ని అక్కడికి తీసుకునిపోయాడు. అలా వెళ్తుండగా మాతో అతడు మాట్లాడాడు.
 
తాము బస చేసిన పహల్గామ్ హోటల్‌లో పర్యాటకుల చిరునామా, ఇతర వివరాల గురించి కొంతమంది వ్యక్తులు అడిగారు. ఈ అంశాలన్నింటినీ బట్టి ఆ వ్యక్తులు చేస్తున్న పనులు అనుమానస్పదంగా కనిపించాయి. అయితే, మరొక మహిళా పర్యాటకురాలు ఖురాన్ గురించి చర్చిస్తున్నప్పుడు ఒక గుర్రపు స్వారీ వ్యక్తి వారి వ్యక్తిగత సమాచారాన్ని అడుగుతూనే వున్నాడు. ఆమె చెప్పిన దాని ప్రకారం, ఆ బృందంలోని సహచరులు ముస్లింలా లేక హిందువులా అని కూడా అతను విచారించాడు. తమతో వున్నవారంతా ముస్లింలే అని ఆమె అతనికి తెలియజేసింది. అతడు వెంటనే అమర్‌నాథ్‌కు వస్తే రిజిస్ట్రేషన్ లేకుండా టూర్ ఏర్పాటు చేస్తానని చెప్పాడు. ఆమె అతని ఫోటోను దూరం నుంచి తీసింది. ఇంతలో అతడు తన సెల్ ఫోనుని బైటకు తీసి 35 తుపాకులు అంటూ ఏదో ఫోనులో కోడ్ భాషలో మాట్లాడాడనీ తెలిపింది. దీన్నిబట్టి గుర్రపు స్వారీకి తీసుకెళ్లిన వ్యక్తుల వద్ద ఉగ్ర కుట్రకు సంబంధించి అంతా తెలిసి వుండవచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.