శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ivr
Last Modified: శుక్రవారం, 22 సెప్టెంబరు 2017 (20:07 IST)

'బాహుబలి 2'ను పడగొట్టిన 'న్యూటన్‌'... ఏ విషయంలో...?

ఈ ఏడాది ఆస్కార్‌ బరిలో బాలీవుడ్‌కు చెందిన 'న్యూటన్‌' చిత్రం చోటు దక్కించుకుంది. నటుడు రాజ్‌కుమార్‌ రావు నటించిన ఈ సినిమా ఈ శుక్రవారమే విడుదల కావడం విశేషం. అమిత్‌ వి మసూర్కర్‌ దర్శకత్వం వహించగా మనీష్‌ ముద్రా నిర్మించారు. నక్సలిజం నేపథ్యంలో రూపొందిన ఈ

ఈ ఏడాది ఆస్కార్‌ బరిలో బాలీవుడ్‌కు చెందిన 'న్యూటన్‌' చిత్రం చోటు దక్కించుకుంది. నటుడు రాజ్‌కుమార్‌ రావు నటించిన ఈ సినిమా ఈ శుక్రవారమే విడుదల కావడం విశేషం. అమిత్‌ వి మసూర్కర్‌ దర్శకత్వం వహించగా మనీష్‌ ముద్రా నిర్మించారు. నక్సలిజం నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రాన్ని అస్కార్‌ అవార్డు కమిటీ సంయుక్తంగా ఎంపిక చేసింది. 
 
గత కొద్దిరోజులుగా హైదరాబాద్‌లో ఆస్కార్‌ ఎంపిక ప్రకియ జరుగుతోంది. వివిధ రాష్ట్రాల నుంచి 26 సినిమాలను పరిశీలించారు. ఈ విషయాన్ని ఆస్కార్‌ కమిటీ చైర్మన్‌ సి.వి.రెడ్డి శుక్రవారం నాడు హైదరాబాద్‌లో ప్రకటించారు. ఆయన మాట్లాడుతూ... 'న్యూటన్‌'కు ఆస్కార్‌లో చోటు దక్కింది. మన దేశం తరఫున అధికారికంగా నామినేట్‌ అయిన చిత్రమిది. 
 
మావోయిస్టు ప్రభావిత అడవుల్లో ఎన్నికల డ్యూటీకి వెళ్ళిన ప్రభుత్వ క్లర్క్‌కు ఎదురైన ఘటనల నేపథ్యంపై తెరకెక్కిన చిత్రమిది. అమిత్‌ మసూర్కర్‌ దర్శకత్వంలో తెరకెక్కింది. ఇటీవలే విడుదలైన న్యూటన్‌.. ఇప్పటికే అమితాబ్‌తో పాటు పలువురి ప్రశంసలు అందుకుంది. ఇండియా ఆస్కార్‌ కమిటీ సెలక్టింగ్‌లో ఫారిన్‌ లాంగ్వేజ్‌ ఫిలిం అవార్డుల కేటగిరిలో దీన్ని సభ్యులంతా ఎంపిక చేశాం. దాదాపు 26 ఎంట్రీలు వివిధ భాషల నుంచి వచ్చాయి. 
 
హిందీ నుంచి 12, మరాఠీ నుంచి 5, తెలుగు, కన్నడ, మలయాళం, బెంగాలీ నుంచి రెండేసి చిత్రాలు వచ్చాయి. తమిళం నుంచి ఒక్క సినిమా ఎంట్రీకి వచ్చింది. తెలుగులో బాహుబలి-2, శాతకర్ణికి వచ్చాయి. అన్ని భాషల సినిమాలను ఈ నెల 16 వరకు తిలకించాం. వాటిని చూశాక అన్ని కోణాల నుంచి పరిశీలించి 'న్యూటన్‌'ను ఎంపిక చేయడం జరిగింది. యాదృశ్చికంగా ఈ రోజే సినిమా విడుదల కావడం.. కేంద్ర ప్రభుత్వం కోటి రూపాయలు ప్రకటించడం జరిగాయని తెలిపారు. 
 
భారత్‌లో ఆస్కార్‌ ఫారిన్‌ లాంగ్వేజ్‌ కేటగిరి 1957లో ఆరంభమైంది. తొలుత 'మదర్‌ ఇండియా' నామినేషన్‌కు వచ్చింది. ఆ తర్వాత 1988లో 'సలాం బాంబే', 2001లో 'లగాన్‌'లు నామినేట్‌ అయ్యాయి. అయితే గత 16 ఏళ్ళుగా మూడు సినిమాలే నామినేట్‌ కాగా, ఈసారి న్యూటన్‌కు దక్కడం ప్రత్యేకంగా చెప్పుకోవచ్చని కమిటీ చైర్మన్‌ నిర్మాత సి.వి.రెడ్డి అన్నారు. అంతర్జాతీయ స్థాయిలో ఆకట్టుకునే కథలు లేకపోవడంతో తెలుగు నుంచి సరైన ప్రాధాన్యత లేదని ఆయన చెప్పుకొచ్చారు. 
 
సెలక్షన్‌ కమిటీలో వివిధ రాష్ట్రాలకు చెందిన సాంకేతిక నిపుణులు హరికుమార్‌, వికెప్రసాద్‌, ఇంద్రణ్‌ ముఖర్జీ, సమీర్‌ సేన్‌, అప్పర్ణాసోన్‌, సుల్తాన్‌ గుప్తా, సచిన్‌ కుందల్‌కర్‌ వున్నారు. ఫిలిం ఫెడరేషన్‌ కమిటీ ఛైర్మన్‌ సి. కళ్యాణ్‌ మాట్లాడుతూ... నిష్పక్షపాతంగా కమిటీ తీసుకున్న నిర్ణయమిదని చెప్పారు.