సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 20 సెప్టెంబరు 2016 (12:57 IST)

బాహుబలి 2 షూటింగ్ సీన్స్ లీకైయ్యాయోచ్.. నెట్లో ఫ్యాన్స్ పండగ.. లోయలో కొలను..

ప్రపంచ సినీ ప్రేక్షకులను టాలీవుడ్ వైపు తిరిగి చూసేలా చేసిన బాహుబలి సినిమాకు సీక్వెల్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. బాహుబలి ది బిగినింగ్‌లా బాహుబలి ది కన్‌క్లూజన

ప్రపంచ సినీ ప్రేక్షకులను టాలీవుడ్ వైపు తిరిగి చూసేలా చేసిన బాహుబలి సినిమాకు సీక్వెల్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. బాహుబలి ది బిగినింగ్‌లా బాహుబలి ది కన్‌క్లూజన్ అంటూ జక్కన్న సీక్వెల్‌ను రూపొందిస్తున్నాడు. ఇందుకోసం భారీ సెట్స్ రూపొందించాడు. భారీగా ఖర్చు పెట్టాడు. విజువల్ వండర్‌గా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తేవాలని.. అద్భుతంగా తెరకెక్కిస్తున్నాడు. అయితే ఇంతలోనే బాహుబలి2కు సంబంధించిన కొన్ని ఫోటోలు నెట్లో లీక్ అయ్యాయి. 
 
క్లైమాక్స్లో వచ్చే భారీ యుద్ధ సన్నివేశాల చిత్రీకరణ పూర్తి చేసుకున్న బాహుబలి టీం ప్రస్తుతం మరికొన్ని సీన్స్‌ను రూపొందించే పనిలో ఉండగా, ఈ షూటింగ్కు సంబందించిన లొకేషన్ ఫోటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఓ భారీ లోయలో జరుగుతున్న షూటింగ్లో యుద్ధ పరికరాలతో కూడిన సీన్స్ అద్భుతంగా ఉన్నాయి. ఆయుధాలు, నీటి కొలనులతో పాటు ఓ భారీ గుహ కూడా కనిపిస్తోంది. ఈ హంగామా అంతా చూస్తుంటే, ఈ సీన్ ప్రీక్లైమాక్స్లో వచ్చే సన్నివేశాలకు సంబంధించిందని సినీ పండితులు అంటున్నారు.