ఆదివారం, 12 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : శనివారం, 24 ఫిబ్రవరి 2018 (19:51 IST)

నష్టాల్లో ఉన్న నిర్మాతకు బాలయ్య భరోసా.. నేనున్నానంటూ...

చిత్ర పరిశ్రమలో నిర్మాతలు నష్టాలను చవిచూడటం సహజమే. అయితే, అలాంటి నిర్మాతలను ఏ కొద్దిమంది హీరోలు మాత్రమే ఆదుకునేందుకు ముందుకు వస్తుంటారు. అలాంటి హీరోల్లో నందమూరి బాలకృష్ణ ఒకరు. ఆయన తాజాగా ప్రముఖ నిర్మా

చిత్ర పరిశ్రమలో నిర్మాతలు నష్టాలను చవిచూడటం సహజమే. అయితే, అలాంటి నిర్మాతలను ఏ కొద్దిమంది హీరోలు మాత్రమే ఆదుకునేందుకు ముందుకు వస్తుంటారు. అలాంటి హీరోల్లో నందమూరి బాలకృష్ణ ఒకరు. ఆయన తాజాగా ప్రముఖ నిర్మాతను ఆదుకునేందుకు ముందుకు వచ్చారు. ఆ నిర్మాత ఎవరో కాదు.. సి. కళ్యాణ్. 
 
ఈయన తొలుత బాలకృష్ణ హీరోగా కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో "జై సింహా" పేరుతో ఓ చిత్రాన్ని తీయగా, అది బాక్సాఫీస్ వద్ద బోల్తాపడింది. అలాగే, సాయిధరమ్ తేజ్ హీరోగా వివి వినాయక్ దర్శకత్వంలో "ఇంటెలిజెంట్" చిత్రాన్ని తీశారు. ఇది కూడా డిజాస్టర్ లిస్టులో చేరిపోయింది. దీంతో నిర్మాత సి.కళ్యాణ్ నష్టాల ఊబిలో కూరుకునిపోయాడు. 
 
ఈనేపథ్యంలో సి.కళ్యాణ్ నిర్మాణంలో మరో సినిమా చేసి నష్టాల నుండి గట్టెక్కిస్తానని ఆయనకు మాటిచ్చినట్లు ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ఈ చిత్రానికి వి.వి వినాయక్ దర్శకత్వం వహించనుండగా, బాలయ్య బాబు హీరోగా నటించనున్నారు. పైగా, భారీ విజయం సాధించే దిశగా ఈ సినిమా కోసం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని ఫిలింనగర్ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.