శుక్రవారం, 8 డిశెంబరు 2023
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : సోమవారం, 12 డిశెంబరు 2022 (13:14 IST)

గోపీచంద్‌తో ప్రభాస్‌ పెండ్లి గురించి అడిగించిన బాలకృష్ణ!

balakrishna-prabhas
balakrishna-prabhas
నందమూరి బాలకృష్ణ తాజాగా చేస్తున్న అన్‌స్టాపబుల్‌ ఎపిసోడ్‌ ఈసారి ఆసక్తిగా మారబోతుంది. మీరు ఎప్పుడూ చూడని కొత్త కోణంలో చూస్తారంటూ ఆహా! సంస్థ చిన్న ప్రోమోతోపాటు కాప్షన్‌ కూడా జోడించింది. త్వరలో టెలికాస్ట్‌ కాబోయే ప్రోగ్రామ్‌లో స్నేహితులైన గోపీచంద్‌, ప్రభాస్‌ను ఒకేసారి ఇంటర్వ్యూ చేసేలా ప్లాన్‌ చేసింది. బాలకృష్న తన స్టయిల్‌లో కళ్ళజోడును ఎగురవేస్తూ పట్టుకోవడం అందుకు ప్రభాస్‌ ఆశ్చర్యంతో మెచ్చుకోవడం జరిగింది.
 
gopichand-prabhas
gopichand-prabhas
ఇక ఈ ఎపిసోడ్‌లో గోపీచంద్‌, ప్రభాస్‌ స్నేహం గురించి, అనుష్క విషయం కూడా ప్రస్తావనకూడా రాబోతుందని హింట్‌ ఇచ్చినట్లుగా వుంది. రాజమండ్రి బ్యాక్‌డ్రాప్‌ గోదావరి బ్రిడ్జ్‌ నేపథ్యాన్ని చూపిస్తూ ఇరువురిని బాలకృష్ణ ఇంటర్వ్యూ చేశాడు.

Gopichand, Prabhas, Nandamuri Balakrishna
Gopichand, Prabhas, Nandamuri Balakrishna
ఇందులో కృష్ణంరాజుగురించి ఆయన సేవా కార్యక్రమాలు గురించి, వాటిని కొనసాగించే విధంగా ప్రభాస్‌ ఏవిధంగా చేస్తున్నారనేది తెలియనుంది. ఇటీవలే షూటింగ్‌లో గాయపడి కాలుకు శస్త్ర చికిత్స కూడా చేసుకున్న ప్రభాస్‌ ఇప్పుడు నాలుగు సినిమాల్లో నటిస్తున్నాడు. అందులో మారుతీ సినిమాలో ద్విపాత్రాభినయం చేయనున్నాడని తెలుస్తోంది.