Daily Horoscope
✕

NBK 111: దాదా- మైసూరులో షూటింగ్ పునః ప్రారంభించిన బాలకృష్ణ

Written By దేవీ
Updated: మంగళవారం, 6 అక్టోబరు 2026 (18:22 IST)
NBK as dada
నందమూరి బాలకృష్ణ, బ్లాక్‌బస్టర్ దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘దాదా’ సినిమా షూటింగ్ నేటి నుంచి మైసూరులో పునఃప్రారంభమైంది. ఇటీవల గాయపడిన బాలకృష్ణ కోలుకుని తిరిగి షూటింగ్ సెట్స్‌లోకి అడుగుపెట్టారు. కీలకమైన, లెన్తీ షెడ్యూల్‌లో ఆయన చిత్రబృందంతో కలిసి పాల్గొంటున్నారు. ప్రస్తుతం జరుగుతున్న షెడ్యూల్‌లో ప్రధానంగా టాకీ పార్ట్‌ను చిత్రీకరిస్తున్నారు. బాలకృష్ణతో పాటు పలువురు ప్రముఖ నటీనటులు ఈ షూటింగ్‌లో పాల్గొంటున్నారు. ఈ షెడ్యూల్‌లో సినిమాకు సంబంధించిన కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు.
 
 
బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో వచ్చిన ‘వీరసింహారెడ్డి’ తర్వాత మరోసారి వస్తున్న సినిమా కావడంతో దాదాపై భారీ అంచనాలు ఉన్నాయి.  గోపీచంద్ మలినేని ఈ చిత్రాన్ని స్టైలిష్ కమర్షియల్ యాక్షన్ స్పెక్టకిల్‌గా తెరకెక్కిస్తున్నారు. ‘ది కింగ్ ఆఫ్ కెయాస్’గా బాలకృష్ణను పరిచయం చేసిన టైటిల్ గ్లింప్స్ ఇప్పటికే సినిమాపై భారీ హైప్‌ను క్రియేట్ చేసింది. ఈ చిత్రంలో మంచు మనోజ్, కాజల్ అగర్వాల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
 
ఈ చిత్రానికి టాప్ టెక్నికల్ టీం పనిచేస్తోంది. అరవింద్ ఎస్ కశ్యప్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, ఎస్. థమన్ సంగీతం సమకూరుస్తున్నారు. ఏఎస్ ప్రకాశ్ ప్రొడక్షన్ డిజైన్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. నవీన్ నూలి ఎడిటర్‌. సాయి మాధవ్ బుర్రా సంభాషణలు రాశారు. రామ్ లక్ష్మణ్, రవి వర్మ, వెంకట్ యాక్షన్ సీక్వెన్స్‌లను కొరియోగ్రఫీ చేస్తున్నారు.
 
‘దాదా’ డిసెంబర్ 24న థియేటర్లలోకి రానుంది. క్రిస్మస్ కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రం భారీ స్థాయి మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా అలరించేందుకు సిద్ధమవుతోంది.
 
నటీనటులు: నందమూరి బాలకృష్ణ, మంచు మనోజ్, కాజల్ అగర్వాల్
About Author
దేవీ
దేవీ (మురళీకృష్ణ)  నిక్‌నేమ్- శక్తిమాన్ సినిమా రంగంలో దాదాపు 26 ఏళ్ల అనుభవం ఉంది. కళారంగంపై ఇంట్రెస్టుతో రిపోర్టర్‌గా కెరీర్ మొదలైంది. అలా చేస్తూనే విజయవాడలో రంగస్థలంపై నాటకాల్లో పాత్రలు పోషించారు. అలా ఆర్టిస్టుగా.. పలు సినిమాలు, సీరియల్స్‌లో సైతం నటించారు. స్క్రిప్ట్ వర్క్‌లో కూడా కొద్దికాలం చేశారు. అలా ప్రజాశక్తి దినపత్రికలో సినిమా పేజీ న్యూస్ రిపోర్టర్‌గా తనతోనే ఆరంభం అయింది. అలా చేస్తుండగానే మెగాస్టార్ చిరంజీవి గారితో ఇంటర్వ్యూ చేశాక...... Read More

అన్నీ చూడండి

మద్యం తాగొద్దు అన్నందుకు 80 అడుగుల వాటర్ ట్యాంకు పైనుంచి దూకేశాడు, వీడియో

హైడ్రా అదుర్స్.. తమ్మిడికుంట చెరువుకు కొత్త శోభ.. వరదలతో భయం లేదు (video)

పీఆర్పీని స్థాపించిన విజయసాయి రెడ్డి.. సీఎం పోస్టుపై ఆసక్తి లేదంటూ ప్రకటన

ఏఐతో పాటు 30కి పైగా అజెండా అంశాలకు ఆమోదం తెలిపిన ఏపీ మంత్రివర్గం

ప్రపంచ దేశాల చూపు భారత్‌ వైపు : కేంద్ర మంత్రి ప్రవీణ్ ఖండైల్వాల్

అన్నీ చూడండి

ప్రపంచ మధుమేహ దినోత్సవం: కాలిఫోర్నియా బాదంతో మేలు

కిడ్నీలు 90 శాతం పాడైపోయేవరకూ లక్షణాలు కనిపించవా?

రుచీపచీ లేని ఈ పండు చేసే మేలు ఎంతో తెలుసా?

ఫ్రిజ్‌లో కోడిగుడ్లు పెడితే ఏమవుతాయి?

ఆంధ్రప్రదేశ్ కోస్తా ప్రాంత ప్రజలకు తుఫాను అనంతర హెల్త్ అడ్వైజరీ జారీ చేసిన స్టార్ హెల్త్

తర్వాతి కథనం
Show comments