మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వాసు
Last Updated : శుక్రవారం, 26 ఏప్రియల్ 2019 (13:52 IST)

కన్నడ సినిమాలో బాలయ్య పవర్‌ఫుల్ రోల్...

టాలీవుడ్‌లో పవర్‌ఫుల్ పాత్రలకు పెట్టింది పేరైన బాలయ్య బాబు... త్వరలో కన్నడలో కూడా ఒక పవర్‌ఫుల్ రోల్ చేయనున్నారట...
 
వివరాలలోకి వెళ్తే... ఎన్నికల హడావుడి తగ్గడంలో... బాలయ్య బాబు బోయపాటి శ్రీను దర్శకత్వంలో తన తదుపరి చిత్రాన్ని చేయనున్నట్టుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ ప్రాజెక్టు కాస్తా... బోయపాటి శ్రీను ఇంకా స్క్రిప్ట్‌పై కసరత్తు చేస్తూనే ఉండడంతో మరింత ఆలస్యమయ్యే సూచనలు కనబడుతున్నట్లు తెలుస్తోంది.
 
ఈ నేపథ్యంలో... బాలకృష్ణ త్వరలో కన్నడలో ఒక సినిమా నటించేందుకు సిద్ధమవుతున్నారని సమాచారం. కన్నడంలో శివరాజ్ కుమార్ హీరోగా రూపొందుతున్న 'భైరతి రణగళ్' సినిమాలో ఒక పవర్‌ఫుల్ రోల్ ఉండటంతో దానిని బాలయ్యతో చేయించాలనుకున్న శివరాజ్ కుమార్, ఆయనని సంప్రదించి ఒప్పించినట్లు సమాచారం. శివరాజ్ కుమార్‌తో గల సాన్నిహిత్యం కారణంగా ఈ రోల్ చేయడానికి బాలయ్య బాబు అంగీకరించినట్లు తెలుస్తోంది.
 
మరి సింహా కన్నడంలో ఎంత మేరకు గర్జిస్తుందో వేచి చూద్దాం...