బోయపాటి బర్త్ డేకి బాలయ్య షాకింగ్ గిఫ్ట్... ఏంటది?
నందమూరి నట సింహం బాలకృష్ణ ఎన్టీఆర్ కథానాయకుడు సినిమా తర్వాత ఊర మాస్ డైరెక్టర్ బోయపాటితో సినిమా చేయనున్నట్టు స్వయంగా బాలకృష్ణ ఎనౌన్స్ చేసారు. ఫిబ్రవరి నుంచే షూటింగ్ స్టార్ట్ చేయాలనుకున్నారు కానీ..కుదరలేదు. ఆ తర్వాత బోయపాటి చరణ్‌తో తీసిన వినయ విధేయ రామ సినిమా వచ్చింది. ఈ సినిమా డిజాస్టర్ అయ్యింది. అప్పటి నుంచి అందరిలో ఒకటే డౌట్.
బాలయ్య తదుపరి చిత్రం బోయపాటితో ఉంటుందా అని. ఎన్నికల ఫలితాల అనంతరం ఈ సినిమా ఉంటుంది అనుకున్నారు. అయితే... బోయపాటికి బాలయ్య షాక్ ఇచ్చారు. ఏమైందో ఏమో కానీ... గురువారం సాయంత్రానికి సీన్ మారిపోయింది. 2018 సంక్రాంతికి తనకు జై సింహా అనే ఓ మాదిరి విజయాన్ని అందించిన సినిమా డైరెక్టర్ కె.ఎస్. రవికుమార్‌తో పని చెయ్యాలని బాలయ్య డిసైడ్ అయ్యారు.
ఈ మేరకు నిర్మాత సి. కల్యాణ్ నుంచి అధికారిక ప్రకటన వెలువడింది. బాలకృష్ణ, కె.ఎస్. రవికుమార్ కాంబినేషన్ సినిమా మే నెలలో లాంఛనంగా మొదలై, జూన్‌లో సెట్స్ మీదకు వెళ్లనున్నది. మరి బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలయ్య సినిమా ఉంటుందా? ఉంటే ఎప్పుడు? కె.ఎస్. రవికుమార్ సినిమా తర్వాత ఆయనతో చేస్తాడా?.. అనే విషయాలు త్వరలో తెలియనున్నాయి. అయితే.. బోయపాటి పుట్టినరోజు నాడే బాలయ్య షాక్ ఇవ్వడం విశేషం.