గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By శ్రీ
Last Modified: శనివారం, 22 డిశెంబరు 2018 (17:03 IST)

బాలయ్య - బోయ‌పాటి హ్యాట్రిక్ మూవీ గురించి ఇంట్ర‌స్టింగ్ న్యూస్..!

నంద‌మూరి బాల‌కృష్ణ - ఊర మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీను కాంబినేష‌న్లో రూపొందిన సింహా, లెజెండ్ సినిమాలు ఎంత‌టి విజ‌యాలు సాధించాయో తెలిసిందే. ఈ రెండు సినిమాలు స‌క్స‌స్ సాధించ‌డంతో బాల‌య్య - బోయ‌పాటి కాంబినేష‌న్లో హ్యాట్రిక్ మూవీ ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అని అభిమానులు వెయ్యి క‌ళ్ల‌తో ఎదురుచూస్తున్నారు. అయితే.. ఎన్టీఆర్‌ పాట‌ల విడుద‌ల‌, ట్రైల‌ర్ ఆవిష్క‌ణ స‌భ‌లో.. తీపి క‌బురు నంద‌మూరి అభిమానుల‌కు చేరింది. 
 
అదే.. బాల‌కృష్ణ – బోయ‌పాటి కాంబినేష‌న్‌లోని హ్యాట్రిక్ మూవీ న్యూస్. ఇంట్ర‌స్టింగ్ న్యూస్ ఏంటంటే.. ఈ చిత్రాన్ని ఎన్‌బికె సంస్థ త‌ర‌పున బాల‌కృష్ణ నిర్మించ‌నున్నారు. ఫిబ్ర‌వ‌రిలో ఈ చిత్రాన్ని లాంఛ‌నంగా ప్రారంభిస్తారు. ఎన్టీఆర్ ఆడియో ఆవిష్క‌రణ స‌భ‌లో ద‌ర్శ‌కుడు బోయ‌పాటి శ్రీ‌ను మాట్లాడుతూ... నాకు రాయ‌డం, తీయ‌డం ఈ రెండే తెలుసు. ప్ర‌తీ సినిమా నా మొద‌టి సినిమాలానే భావిస్తా. నా ప్రాణం పెట్టి ప‌ని చేస్తా. సింహా, లెజెండ్‌ల‌కు ప‌ది శాతం మించిన సినిమానే చూపిస్తా అని నంద‌మూరి అభిమానుల‌కు మాటిచ్చారు బోయ‌పాటి. మ‌రి.. ఈసారి బాల‌య్య‌ను ఏ పాత్ర‌లో చూపించ‌నున్నారో..?