గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By శ్రీ
Last Modified: బుధవారం, 10 ఏప్రియల్ 2019 (17:17 IST)

పాపం.. వినాయ‌క్... బాలయ్య కోసం వెయిట్ చేసీ చేసీ...

ఆది సినిమాతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మై.. అన‌తి కాలంలోనే స్టార్ డైరెక్ట‌ర్ స్టేట‌స్ సొంతం చేసుకుని ఎన్నో సంచ‌ల‌న చిత్రాలు అందించిన డైరెక్ట‌ర్ వి.వి.వినాయ‌క్. ఖైదీ నెంబ‌ర్ 150 సినిమా త‌ర్వాత మెగాస్టార్ మేన‌ల్లుడు సాయితేజ్‌తో ఇంటిలిజెంట్ సినిమాని తెర‌కెక్కించారు కానీ... ఈ సినిమా డిజాష్ట‌ర్ అయ్యింది. ఆ త‌ర్వాత ఇప్ప‌టివ‌ర‌కు వినాయ‌క్ సినిమా సెట్స్ పైకి వెళ్ళలేదు. బాల‌య్య‌తో సినిమా ఉంటుంద‌ని వార్త‌లు వ‌చ్చాయి కానీ.. అఫిషియ‌ల్ ఎనౌన్స్‌మెంట్ మాత్రం రాలేదు.
 
దీనికి కార‌ణం ఏంటంటే... వినాయ‌క్ ఎన్ని క‌థలు చెప్పినా బాల‌య్య‌కి మాత్రం న‌చ్చేవి కాద‌ట‌. అందుచేత ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లలేదు. గోపీ మోహ‌న్‌తో వినాయ‌క్ క‌థ రెడీ చేయిస్తున్నార‌ట బాల‌య్య కోసం. మ‌రోవైపు వెంక‌టేష్ కోసం కూడా క‌థ రెడీ చేసేలా ప్లాన్లో ఉన్నార‌ట వినాయ‌క్. అయితే... బాల‌య్య ప్ర‌స్తుతం ఎన్నిక‌ల హ‌డావిడిలో ఉన్నారు. వెంకీ చైత‌న్య‌తో క‌లిసి వెంకీ మామ షూటింగ్‌లో ఉన్నారు. 
 
అటు బాల‌య్య‌, ఇటు వెంకీ ఫ్రీ అయ్యాక వినాయ‌క్ క‌థ చెప్పాలి. న‌చ్చితే డేట్స్ ఇవ్వాలి. ఇదంతా జ‌ర‌గ‌డానికి చాలా టైమ్ ప‌డుతుంది. ఒక‌ప్పుడు సెన్సేష‌న‌ల్ హిట్స్ ఇచ్చిన వినాయ‌క్.. ఇప్పుడు చేతిలో సినిమాలు లేక ఏం చేయాలో తెలియ‌ని ప‌రిస్థితిలో ఉన్నారు. పం.... వినాయ‌క్..!