మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 16 జులై 2021 (11:23 IST)

"బాలికా వధు" భామ సురేఖా సిక్రి ఇకలేరు..

చిన్నారి పెళ్లి కూతురు (బాలికా వధు) ఫేమ్, జాతీయ అవార్డు గ్రహీత సురేఖా సిక్రీ ఇకలేరు. ఆమె ముంబైలో కన్నుమూశారు. ఆమెకు వయసు 75 యేళ్లు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ వచ్చిన ఆమె శుక్రవారం మృతి చెందారు. 
 
హిందీ చిత్రం 'బధాయ్ హో' (2018) లో అమ్మమ్మ పాత్రకు ఆమె ప్రశంసలు అందుకున్నారు. మూడు జాతీయ చలనచిత్ర అవార్డుల గ్రహీత సిక్రి ఇటు సినిమాల్లోనే కాకుండా, థియేటర్, ఇంకా టీవీ సీరియల్స్‌లో నటించారు. 
 
'తమస్', 'మమ్మో', 'సలీం లాంగ్డే పె మాట్ రో', 'జుబీదా' నటించి పాపులర్ అయ్యారు. ఇక హిందీ డైలీ సీరియల్ 'బలికా వాదు'తో చాలా మందికి దగ్గరయ్యారు సిక్రీ. ఆయుష్మాన్ ఖుర్రానా నటించిన 'బధాయ్ హో' (2018)లో వచ్చిన ఈ చిత్రంలో సిక్రీ అమ్మమ్మ పాత్రలో నటించి ప్రశంసలు అందుకున్నారు. ఈ చిత్రానికిగాను సిక్రీకి ఉత్తమ సహాయ నటిగా జాతీయ అవార్డును గెలుచుకున్నారు.