1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , మంగళవారం, 11 ఏప్రియల్ 2017 (07:35 IST)

బాక్సింగ్ జీవితం.. నటన కృత్రిమం.. కాబట్టే కష్టం అంటున్న రితిక

బాక్సింగ్‌కు నటనకు ఏమైనా సంబంధం ఉందా అంటే సంవత్సరం క్రితం వరకు ఎవరూ అంగీకరించేవారు కాదు. కానీ అమీర్ ఖాన్ నటించిన దంగల్ సినిమా నిజజీవితంలోని మహిళా బాక్సర్లను ఒక్కసారిగా సినిమా ప్రపంచంలోకి తీసుకొచ్చింది. ఆ కోవలో ఇప్పుడు మరో బాక్సర్ తెలుగు సినిమా ప్రపంచ

బాక్సింగ్‌కు నటనకు ఏమైనా సంబంధం ఉందా అంటే సంవత్సరం క్రితం వరకు ఎవరూ అంగీకరించేవారు కాదు. కానీ అమీర్ ఖాన్ నటించిన దంగల్ సినిమా నిజజీవితంలోని మహిళా బాక్సర్లను ఒక్కసారిగా సినిమా ప్రపంచంలోకి తీసుకొచ్చింది. ఆ కోవలో ఇప్పుడు మరో బాక్సర్ తెలుగు సినిమా ప్రపంచాన్ని దున్నేయడానికి సిద్ధమవుతున్నారు. సాలా ఖడూస్‌ పేరిట హిందీలో, ఇరుది సుత్రు పేరుతో తమిళంలో విడుదలైన మాధవన్‌ చిత్రానికి రీమేక్‌గా తీసిన 'గురు' చిత్రంలో బాక్సర్‌గా పాత్రకు జీవం పోసిన నిజమైన బాక్స‌ర్ రితికా సింగ్ ఆ పాత్ర కోసమే పుట్టిందన్నట్టుగా ప్రేక్షకులపై బలమైన ముద్ర వేసింది. ఇప్పుడు రాఘవ లారెన్స్‌తో కలిసి ఆమె నటించిన ‘శివలింగ’ చిత్రం ఈ నెల 14న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
 
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రితిక మాట్లాడుతూ బాక్సింగ్‌తో పోలిస్తే నటన చాలా కష్టమని అన్నారు. ‘ఈ సినిమా కోసం డ్యాన్స్‌ ఎక్కువ చేయాల్సి వచ్చింది. ‘శివలింగ’ కథ బాగా నచ్చింది.. అందుకే ఒప్పుకొన్నా. ఇది ఓ హారర్‌ సినిమా. నా మొదటి సినిమాలో మేకప్‌ లేకుండా కనిపించా. కానీ ఇందులో మేకప్‌తో ఆధునిక యువతిగా నటించా. బాక్సింగ్‌తో పోలిస్తే నటన చాలా కష్టం. ఈ సినిమా కోసం డ్యాన్స్‌ ఎక్కువ చేయాల్సి వచ్చింది. చిన్నప్పటి నుంచి బాక్సింగ్‌ అలవాటు ఉంది కాబట్టి కష్టమనిపించలేదు.. కానీ నటన అలా కాదు. కొత్తలోనే వెంకటేశ్‌, మాధవన్‌లాంటి అగ్ర నటులతో కలిసి పనిచేసే అవకాశం వచ్చింది. ఈ సినిమా కోసం లారెన్స్‌తో కలిసి నటించా’ అని రితికా చెప్పారు.
 
జీవితాన్ని బాక్సింగ్ నుంచి నటనవైపు తిప్పేసిన రితికకు సినీ ప్రపంచం మంచి అవకాశాలు ఇవ్వాలని కోరుకుందాం.