సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 20 ఆగస్టు 2022 (17:10 IST)

నటి శ్రీరెడ్డి సూక్తులు.. పిల్లల పెంపకం గురించి... (video)

Sri Reddy
Sri Reddy
వివాదాస్పద నటి శ్రీరెడ్డి తన సొంత యూట్యూబ్ ఛానల్ ద్వారా అనేక రకాల వీడియోలు షేర్ చేస్తూ ఉంటుంది. ఇటీవల శ్రీరెడ్డి వంటలక్కగా అవతారం ఎత్తి వంటలు వీడియోలు చేస్తూ.. యూట్యూబ్‌లో షేర్ చేస్తూ ఉంటుంది. పల్లెటూరి పిల్లలాగా కట్టుబొట్టు మార్చి పల్లెటూరి యాసలో మాట్లాడుతూ వివిధ రకాల వంటలను తయారు చేసి అందరికీ రుచి చూపిస్తోంది. 
 
శ్రీరెడ్డి ఈ మధ్యకాలంలో నీతి సూక్తులు కూడా చెబుతోంది. ఇటీవల శ్రీకాకుళం స్టైల్‌లో కింగ్ చేప పెద్ద సెన కూర ఎలా వండాలో వివరించింది. ఈ క్రమంలో శ్రీరెడ్డి పిల్లల పెంపకం గురించి కూడా పలు ఆసక్తికర విషయాలు వెల్లడించింది. చిన్నపిల్లల మనసు చాలా సున్నితంగా ఉంటుందని, ముఖ్యంగా చదువు విషయంలో తల్లిదండ్రులు పిల్లలను ఎక్కువగా ఒత్తిడి చేయవద్దు అంటూ చెప్పుకొచ్చింది. 
 
అంతేకాకుండా సమాజంలో స్త్రీలు బయటకు వెళ్ళినప్పుడు ఎలాంటి దుస్తులు ధరించాలనే విషయం గురించి కూడా వల్లించింది. స్త్రీలు ఇంటి నుండి బయటకు వెళ్ళినప్పుడు శరీరం మొత్తం కప్పుకునేలా దుస్తులు ధరించాలని చెప్పింది.