1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఐవీఆర్
Last Updated : ఆదివారం, 27 జులై 2025 (11:15 IST)

తృటిలో తప్పిన ఘోర విమాన ప్రమాదం, టేకాఫ్ సమయంలో విమానంలో మంటలు (video)

Fire accident
ఇటీవలి కాలంలో విమాన ప్రమాదాలు తరచుగా జరుగుతున్నాయి. తాజాగా శనివారం నాడు డెన్వర్ విమానాశ్రయంలో ల్యాండింగ్ గేర్ పనిచేయకపోవడం వల్ల రన్‌వేపై మంటలు, పొగలు రావడంతో అమెరికన్ ఎయిర్‌లైన్స్ విమానం టేకాఫ్‌ను నిలిపివేయాల్సి వచ్చింది. అత్యవసర ద్వారా తెరిచి 173 మంది ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. ఒక వ్యక్తి స్వల్పంగా గాయపడ్డారని అధికారులు తెలిపారు.
 
బోయింగ్ 737 MAX 8 విమానం మయామికి బయలుదేరింది. దాని టైర్‌లో నిర్వహణ సమస్య తలెత్తడంతో మంటలు చెలరేగాయి. ల్యాండింగ్ గేర్ మంటల్లో కనిపించడంతో భయాందోళనకు గురైన ప్రయాణికులు విమానం నుండి క్రిందికి జారుకుంటున్నట్లు రెస్క్యూ ఫుటేజ్‌లో కనిపిస్తోంది. స్థానిక కాలమాన ప్రకారం ఈ ఘటన మధ్యాహ్నం 2:45 గంటలకు డెన్వర్ విమానాశ్రయం నుండి బయలుదేరినప్పుడు ల్యాండింగ్ గేర్ సంఘటన జరిగింది.