మంగళవారం, 7 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 31 డిశెంబరు 2024 (17:08 IST)

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అదితి శంకర్ ల భైరవం ఫస్ట్ సింగిల్

Bellamkonda Sai Srinivas and Aditi Shankar
Bellamkonda Sai Srinivas and Aditi Shankar
బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నారా రోహిత్, మంచు మనోజ్ నటిస్తున్న చిత్రం 'భైరవం'. విజయ్ కనకమేడల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌పై కెకె రాధామోహన్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని పెన్ స్టూడియోస్‌ డాక్టర్ జయంతిలాల్ గడా సమర్పిస్తున్నారు. ఇప్పటికే విడుదల చేసిన లీడ్ యాక్టర్స్ ఫస్ట్ లుక్ పోస్టర్స్ స్ట్రాంగ్ బజ్‌ను క్రియేట్ చేశాయి. ఇప్పుడు మేకర్స్ మ్యూజికల్ ప్రమోషన్స్ ని కి స్టార్ట్ చేస్తున్నారు.
 
హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పుట్టిన రోజు సందర్భంగా భైరవం ఫస్ట్ సింగిల్ ఓ వెన్నెల సాంగ్ జనవరి 3న రిలీజ్ చేస్తున్నారు. సాంగ్ ఎనౌన్స్ మెంట్ పోస్టర్ లో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ రగ్గడ్ అండ్ మ్యాసీ అవతార్ లో కనిపించడం అదిరిపోయింది. అదితి శంకర్ పల్లెటూరి అమ్మాయిగా ఆకట్టుకున్నారు. పోస్టర్ లో ప్రజెంట్ చేసిన మాస్ డ్యాన్స్ మూమెంట్ కట్టిపడేసింది.
 
ఈ చిత్రానికి శ్రీ చరణ్ పాకాల మ్యూజిక్ అందిస్తున్నారు. సినిమాటోగ్రఫీ హరి కె వేదాంతం, ఛోటా కె ప్రసాద్ ఎడిటింగ్, బ్రహ్మ కడలి ప్రొడక్షన్ డిజైనర్. సత్యర్షి, తూమ్ వెంకట్ డైలాగ్స్ రాస్తున్నారు.
 
తారాగణం: బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మనోజ్ మంచు, నారా రోహిత్, అదితి శంకర్, దివ్యా పిళ్లై, ఆనంది