సోమవారం, 13 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : ఆదివారం, 18 మార్చి 2018 (14:21 IST)

భరత్ అనే నేను.. పంచెకట్టులో మహేష్ బాబు (ఫోటో)

టాలీవుడ్ ప్రిన్స్, మహేష్ బాబు తాజా సినిమా ''భరత్ అనే నేను''. ఈ సినిమాకు సంబంధించి మహేష్ బాబు పంచెకట్టు పోస్టర్‌ను యూనిట్ విడుదల చేసింది. కొరటాల శివ దర్శకత్వంలో ''భరత్‌ అనే నేను'' పొలిటికల్‌ థ్రిల్లర్‌

టాలీవుడ్ ప్రిన్స్, మహేష్ బాబు తాజా సినిమా ''భరత్ అనే నేను''. ఈ సినిమాకు సంబంధించి మహేష్ బాబు పంచెకట్టు పోస్టర్‌ను యూనిట్ విడుదల చేసింది. కొరటాల శివ దర్శకత్వంలో ''భరత్‌ అనే నేను'' పొలిటికల్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో మహేష్ ముఖ్యమంత్రిగా కనిపించబోతున్నాడు. 
 
వరుస బ్లాక్‌ బస్టర్‌లతో ఫుల్‌ ఫామ్‌లో వున్న కొరటాల ఈ సినిమాతో మరో హిట్‌ను తన ఖాతాలో వేసుకుంటాడని సినీ పండితులు జోస్యం చెప్తున్నారు. త్వరలో విడుదల కానున్న ఈ సినిమా ప్రమోషన్‌ కార్యక్రమాలను ప్రారంభించిన చిత్రయూనిట్‌ ఉగాది సందర్భంగా ఆసక్తికరమైన పోస్టర్‌ను రిలీజ్ చేసింది. ఈ పోస్టర్లో పంచెకట్టులో మహేష్ బాబు పంచెకట్టులో కనిపించారు. 
 
మహేష్ సాంప్రదాయ దుస్తుల్లో దైవ దర్శనానికి వెలుతున్నట్టుగా ఉన్న పోస్టర్‌ అభిమానుల్లో మరింత జోష్ పెంచింది. మహేష్ సరసన కైరా అద్వాని హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాకు సంగీతం.. దేవీ శ్రీ ప్రసాద్. డీవీవీ ఎంటర్‌టైన్మెంట్స్‌ బ్యానర్‌పై డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 20వ తేదీన రిలీజ్ కానుంది.