శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : గురువారం, 8 మార్చి 2018 (11:34 IST)

ట్రెండింగ్‌లో అదరగొడుతున్న ''భరత్ అనే నేను'' ట్రైలర్ (Video)

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, కొరటాల శివ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న సినిమా ''భరత్ అనే నేను''. ఈ సినిమా ట్రైలర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. యూట్యూబ్ ట్రెండింగ్‌లోనూ తన సత్తా చాటుకుంటోంది. ఈ

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, కొరటాల శివ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న సినిమా ''భరత్ అనే నేను''. ఈ సినిమా ట్రైలర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. యూట్యూబ్ ట్రెండింగ్‌లోనూ తన సత్తా చాటుకుంటోంది. ఈ చిత్రానికి సంబంధించి ''ది విజన్‌ ఆఫ్‌ భరత్'' పేరిట మంగళవారం ట్రైలర్ విడుదలైంది. 
 
ఈ చిత్రంలో మహేష్ బాబు సీఎం కనబడుతుండగా.. మహేష్ సరసన కైరా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమా ఏప్రిల్ 20న విడుదల కానుంది. ఇక తాజా టీజర్లో మహేష్ డైలాగ్స్ అదిరిపోయాయి. ఒక ఫిక్షనల్ పొలిటికల్ డ్రామాగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. దీనిపై మహేష్ ఫ్యాన్స్ మధ్య భారీ అంచనాలున్నాయి. 
 
ఇకపోతే.. మహేష్ బాబు ''భరత్ అనే నేను'' టీజ‌ర్ విడుద‌లైన 19 గంట‌ల్లోనే కోటి డిజిట‌ల్ వ్యూస్ సాధించింది. ఈ వ్యూస్ సంఖ్య క్షణక్షణం మారిపోతోంది. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.