మంగళవారం, 3 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , గురువారం, 23 ఫిబ్రవరి 2017 (07:10 IST)

భావనపై వేధింపుల ఘటనలో నా పాత్రా.. నెవర్ అంటున్న మలయాళ నటుడు దిలీప్

దక్షిణాది నటి భావనను అపహరించి లైంగిక వేధింపులకు గురి చేసిన ఘటనలో తన ప్రమేయం ఉందంటూ వస్తున్న వార్తలను మలయాళ సీనియర్ నటుడు దిలీప్ తోసిపుచ్చాడు. తనపై కొద్ది రోజులుగా మీడియాలో వస్తున్న వార్తలకు చెక్ పెడుతూ దిలీప్ ఫేస్‌బుక్‌లో వివరణ ఇచ్చాడు.

దక్షిణాది నటి భావనను అపహరించి లైంగిక వేధింపులకు గురి చేసిన ఘటనలో తన ప్రమేయం ఉందంటూ వస్తున్న వార్తలను మలయాళ సీనియర్ నటుడు దిలీప్ తోసిపుచ్చాడు. తనపై కొద్ది రోజులుగా మీడియాలో వస్తున్న వార్తలకు చెక్ పెడుతూ దిలీప్ ఫేస్‌బుక్‌లో వివరణ ఇచ్చాడు. భావన ఘటన మలయాళ చిత్ర పరిశ్రమ సిగ్గుపడేలా చేసిందని, ఆ కేసులో నిందితులతో ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ తనకు ఎలాంటి సంబంధాలూ, పరిచయాలు లేవని దిలీప్ పేర్కొన్నాడు. పోలీసులు ఈ కేసుకు సంబంధించి తనను విచారించలేదని స్పష్టం చేశాడు.
 
తాను ఒక తల్లి, భార్య, కుమార్తెను కలిగి ఉన్న సగటు వ్యక్తినని, తనకు కుటుంబ బాంధవ్యాల విలువ ఏమిటే తెలుసునని దిలీప్ చెప్పాడు. ఈ విషయంలో తనపై వస్తున్న ఆరోపణలను దిలీప్ తీవ్రంగా ఖండించాడు. భావన అపహరణ ఘటనలో తన పాత్ర గురించి కథలు కథలుగా వండి వారుస్తున్న మీడియా సంస్థలు ఒక్క ఆధారాన్ని చూపించాలని దిలీప్ సవాల్ చేశాడు. 
 
అయితే దిలీప్, భావనలమధ్య కొద్ది సంవత్సరాల క్రితం ఘర్షణ చెలరేగిందని, భావన కెరీర్‌ను దెబ్బ తీసే విధంగా దిలీప్ ఆమెకు సమస్యలు సృష్టించాడని వార్తలు వచ్చాయి. అందుకే ఇప్పుడు ఈ ఘటనలో దిలీప్ హస్తం ఉంటుందని పత్రికలు అనుమానం వ్యక్తం చేశాయి. 
 
పోలీసులు మాత్రం ఇంతవరకు దిలీప్ కానీ, చిత్రపరిశ్రమలోని వ్యక్తుల జోక్యం కాని ఈ కేసులో ఉన్నట్లు ప్రకటించలేదు.