గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 2 మార్చి 2022 (18:48 IST)

హాలీవుడ్ సినిమాలకు ధీటుగా భీమ్లా నాయక్ కలెక్షన్స్

పవర్ స్టార్ పవన్ పవన్ కల్యాణ్ భీమ్లా నాయక్ వసూళ్ల పరంగా అదరగొట్టింది. అమెరికాతో పాటు, భారత్‍‌లోసరికొత్త రికార్డును బ్రేక్ చేసింది. దేశంలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల్లో నంబర్ వన్‌గా నిలిచింది. అలాగే ఉత్తర అమెరికాలో ఆరో స్థానంలో నిలిచింది. 
 
అంతేగాకుండా హాలీవుడ్ సినిమాలకు సమానంగా ఈ సినిమా వసూళ్లను రాబట్టింది. భీమ్లా నాయక్ చిత్రం తొలి రోజున ప్రపంచవ్యాప్తంగా 61.24 కోట్లు, రెండో రోజున 32.51 కోట్లు రాబట్టింది. మొత్తం విడుదలైన ఐదు రోజుల్లో భీమ్లా నాయక్ రూ.142.08 కోట్ల వసూళ్లు సాధించింది.