Webdunia - Bharat's app for daily news and videos

Install App

బిగ్ బాస్ 3లో కొత్త ట్విస్ట్...హోస్ట్‌గా తెరమీదకు మరో కొత్త పేరు

Updated: గురువారం, 21 మార్చి 2019 (18:09 IST)
బిగ్ బాస్ 3 ప్రారంభానికి ముందే అనేక ట్విస్ట్‌లు, ఊహాగానాలతో ముందుకు సాగుతోంది... బిగ్ బాస్ 3కి హోస్ట్‌గా రోజుకో కొత్త పేరు తెరమీదకు వస్తోంది. రాజమౌళితో తాజాగా రూపొందుతున్న ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్‌లో బిజీగా ఉండడంతో హోస్ట్‌గా వ్యవహరించేందుకు జూనియర్ ఎన్టీఆర్ నిరాకరించడంతో...‘స్టార్ మా’ యాజమాన్యం అక్కినేని నాగార్జునని సంప్రదించినట్లు గత వారం కథనాలు వెలువడ్డాయి. 
 
గతంలో మీలో ఎవరు కోటీశ్వరుడు ద్వారా బుల్లి తెరని ఒక ఊపు ఊపిన కింగ్... బిగ్ బాస్ 3కి హోస్ట్‌గా దాదాపు ఖరారైపోయినట్లు కూడా మీడియా వర్గాల్లో వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే ఇప్పుడు తాజాగా మరో కొత్త పేరు హోస్ట్‌గా తెరమీదకు వచ్చింది. యంగ్ హీరో విజయ్ దేవరకొండను హోస్ట్‌గా పరిశీలిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
 
అర్జున్ రెడ్డి, గీత గోవిందం వంటి సూపర్ హిట్ సినిమాలతో... ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న టాప్ హీరోలలో విజయ్ దేవరకొండ కూడా ఒకరు. అందుకే ఆయనను బిగ్ బాస్ 3కి హోస్ట్‌గా ఒప్పించేందుకు స్టార్ మా ప్రయత్నిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. 
 
విజయ్ దేవరకొండ డేట్స్ కుదరకపోతే మాత్రం నాగార్జుననే ఖరారు చేసుకోవాలని బిగ్ బాస్ 3 నిర్వాహకులు భావిస్తున్నట్లు సమాచారం. ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ రియాల్టీ షోలో హోస్ట్‌గా వ్యవహరించిన నాగార్జునకు, ఆ అనుభవం కూడా బిగ్ బాస్ 3లో కలిసి వస్తుందని నిర్వాహకులు భావిస్తున్నారట.
 
ఇప్పటికే... బిగ్ బాస్ 1కి జూనియర్ ఎన్టీఆర్, బిగ్ బాస్ 2కి నానీ హోస్ట్‌లుగా వ్యవహరించారు. బిగ్ బాస్ 3లో వీరిద్దరికి ధీటైన స్థాయి హీరోని హోస్ట్‌గా పెట్టుకుంటే షోకి పాపులారిటీ వస్తుందని నిర్వాహకులు భావిస్తున్నారు. బిగ్ బాస్ 2 ముగిసి ఇప్పటికే 10 మాసాలు గడిచిపోయిన నేపథ్యంలో... వీలైనంత త్వరగా హోస్ట్‌ని ఫైనల్ చేసి, సదరు షోను మొదలుపెట్టేయాలని భావిస్తున్నారట. 
 
విజయ్ దేవరకొండ లేదా నాగార్జునలో ఎవరో ఒక్కరు బిగ్ బాస్ 3 హోస్ట్‌గా ఖరారయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. హోస్ట్ ఖరారైనట్లయితే, జూలై నుండే బిగ్ బాస్ 3ని ప్రారంభించాలని స్టార్ మా భావిస్తున్నట్లు సమాచారం. మరి... కంటెస్టెంట్‌లు ఎవరో... అది ఎప్పుడు ఖరారవుతుందో...

అన్నీ చూడండి

విమానం గాల్లో ఎగురుతూ వుండగా భారతీయుడికి ఆస్తమా, కన్నుమూత

సీబీఎస్ఈ బాస్కెట్‌బాల్ ఛాంపియన్‌షిప్ గెలుచుకున్న ఎస్వీఐఎస్ అండర్-14 బాలుర జట్టు

వందేభారత్ రైలు ఢీకొని యువకుడు మృతి.. రీల్స్ చూస్తూ.. బైకుకు తోసుకొచ్చాడా?

రోడ్డు ప్రమాదంలో వరంగల్ సర్పంచ్ మృతి... భర్త రవీందర్ పరిస్థితి విషమం

జార్ఖండ్: రూ. 2.20 కోట్ల రివార్డు.. సీపీఐ మావో నేత ఆకాష్ లొంగుబాటు

అన్నీ చూడండి

Custard apples సీతాఫలాలు వచ్చాయి, తినేవారు తెలుసుకోవాల్సినవి

Almonds బాదం పప్పులు తింటే రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయా?

చక్కెర వ్యాధిని తెచ్చే అలవాట్లు ఇవే...

మహమ్మారులను తట్టుకోగల ఆరోగ్య సంరక్షణ వ్యవస్థకు బాటలు: ఇండియా హెల్త్ ఫార్వర్డ్ 2047

చిన్ననాటి టీకాలతో ఆగిపోకూడదు, అన్ని వయసుల్లో వ్యాక్సినేషన్ అవసరం

తర్వాతి కథనం
Show comments