బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By preethi
Last Modified: మంగళవారం, 4 సెప్టెంబరు 2018 (10:24 IST)

ఎలిమినేషన్స్‌లో ఆ నలుగురు... ఏమైనా జరగొచ్చు కదా ''బిగ్ బాస్''

బిగ్ బాస్... ఈ వీకెండ్ ఎలిమినేషన్స్‌తో కామన్ మేన్ కోటా ఖాళీ అయిపోయింది. నిన్నటి ఎపిసోడ్‌లలో మళ్లీ నామినేషన్ ప్రక్రియ చోటుచేసుకుంది. హౌస్‌లో స్ట్రాంగ్ కంటెస్టెంట్స్‌గా ఉన్న నలుగురు ఈ వారం నామినేట్ అయ్యారు. మర్డర్ టాస్క్‌లో భాగంగా కౌశల్ ఈ సీజన్ మొత్తం

బిగ్ బాస్... ఈ వీకెండ్ ఎలిమినేషన్స్‌తో కామన్ మేన్ కోటా ఖాళీ అయిపోయింది. నిన్నటి ఎపిసోడ్‌లలో మళ్లీ నామినేషన్ ప్రక్రియ చోటుచేసుకుంది. హౌస్‌లో స్ట్రాంగ్ కంటెస్టెంట్స్‌గా ఉన్న నలుగురు ఈ వారం నామినేట్ అయ్యారు. మర్డర్ టాస్క్‌లో భాగంగా కౌశల్ ఈ సీజన్ మొత్తం నామినేషన్‌లో ఉంటారు కాబట్టి ప్రత్యేకంగా నామినేట్ చేయక్కర్లేదని, గీత టాస్క్ గెలిచినందున చివరి దాకా నామినేషన్స్‌లో ఉండదని బిగ్ బాస్ తెలిపారు.
 
అంతేకాకుండా తనీష్, రోల్ రైడాలు కూడా నామినేషన్ నుండి బయటపడ్డారు. ఇక మిగిలిన సభ్యులు ఒక్కొక్కరు ముగ్గుర్ని ఎలిమినేషన్‌కి నామినేట్ చేస్తూ, ఒకర్ని సేవ్ చేయాలన్నారు బిగ్ బాస్.
 
కౌశల్.. అమిత్, శ్యామల, దీప్తిలను నామినేట్ చేసి, సామ్రాట్‌ని సేవ్ చేశారు.
గీతా మాధురి.. అమిత్, సామ్రాట్, శ్యామలను నామినేట్ చేసి, దీప్తిని సేవ్ చేశారు.
రోల్ రైడా.. దీప్తి నల్లమోతు, సామ్రాట్, శ్యామలను నామినేట్ చేసి, అమిత్‌ని సేవ్ చేశారు.
తనీష్.. అమిత్, గణేష్, శ్యామలను నామినేట్ చేసి, సామ్రాట్‌ని సేవ్ చేశారు.
శ్యామల.. దీప్తి నల్లమోతు, అమిత్, సామ్రాట్‌లను నామినేట్ చేశారు.
దీప్తి నల్లమోతు... శ్యామల, అమిత్, సామ్రాట్‌లను నామినేట్ చేశారు.
అమిత్.. దీప్తి, శ్యామల, సామ్రాట్‌లను నామినేట్ చేశారు.
సామ్రాట్.. దీప్తి,శ్యామల, అమిత్ లను నామినేట్ చేశారు.
 
చివరిగా చూస్తే సామ్రాట్, అమిత్, శ్యామల, దీప్తి నామినేషన్స్‌లో ఉండగా, సామ్రాట్‌ను ఇద్దరు సేవ్ చేయడంతో సేఫ్ అయ్యారు.. కనుక ఈ వారం నామినేషన్‌లో కౌషల్‌తో పాటు అమిత్, శ్యామల, దీప్తి మిగిలారు. ఈసారి కూడా లాస్ట్ వీకెండ్‌లా డబుల్ ఎలిమినేషన్ ఉంటుందేమో చూడాలి.