శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By preethi
Last Modified: బుధవారం, 26 సెప్టెంబరు 2018 (10:33 IST)

క్యారెక్టర్స్ ఛేంజ్... దీప్తి పూర్తిగా కౌషల్‌గా మారిపోయి...

బిగ్ బాస్ సీజన్ 2 ముగియడానికి ఇంకా 5 రోజులు మాత్రమే ఉంది. ఈ వారం ప్రారంభంలోనే హాట్ హాట్‌గా మారిన హౌస్ నిన్న ప్రశాంతంగా కనిపించింది. బిగ్ బాస్ హౌస్‌మేట్స్‌కు క్యారెక్టర్ స్వేప్ అనే టాస్క్ ఇచ్చారు. దీని ప్రకారం బిగ్ బాస్ ఒక్కో కంటెస్టెంట్‌కు ఏ క్యారెక్

బిగ్ బాస్ సీజన్ 2 ముగియడానికి ఇంకా 5 రోజులు మాత్రమే ఉంది. ఈ వారం ప్రారంభంలోనే హాట్ హాట్‌గా మారిన హౌస్ నిన్న ప్రశాంతంగా కనిపించింది. బిగ్ బాస్ హౌస్‌మేట్స్‌కు క్యారెక్టర్ స్వేప్ అనే టాస్క్ ఇచ్చారు. దీని ప్రకారం బిగ్ బాస్ ఒక్కో కంటెస్టెంట్‌కు ఏ క్యారెక్టర్ అయితే ఇస్తారో వారు పలు సందర్భాలలో ఎలా ఉంటాయో అలాగే చేయాల్సి ఉంటుంది.
 
సో టాస్క్ ప్రారంభం కాగానే బిగ్ బాస్ ఒక్కో కంటెస్టెంట్‌కు ఒక్కో ఫోటో ఇచ్చారు. సామ్రాట్‌కి దీప్తి ఫోటో, కౌశల్‌కి సామ్రాట్ ఫోటో, దీప్తికి కౌశల్ ఫోటో, తనీష్‌కి గీతా మాధురి ఫోటో, ఇంక గీతా మాధురికి తనీష్ ఫోటోలు ఇచ్చారు. వీళ్లందరూ తమకు వచ్చిన ఫోటోలో ఉన్న వ్యక్తిలా నటించాల్సి ఉంటుంది. సామ్రాట్ ఒక చోట ఉండకుండా అటూ ఇటూ తిరుగుతూ వయ్యారంగా దీప్తిలా నటించారు. ఇక తనీష్ అయితే ఈ ఎపిసోడ్‌కే హైలైట్‌గా నిలిచారు. గీతా వాగానే నటిస్తూ, నడుస్తూ, కౌషల్‌తో గొడవకు దిగుతూ భలే నటించారు.
 
ఇక దీప్తి పూర్తిగా కౌషల్‌గా మారిపోయి బిగ్ బాస్ రూల్స్ గురించి మాట్లాడుతూ, జిమ్ ఏరియాలో డంబెల్స్‌తో వర్కవుట్ చేస్తూ కనిపించారు. గీతా మాధురి మరియు కౌషల్‌లు కూడా తమ పరిధి మేరకు బాగానే నటించారు. ఫైనల్స్ దగ్గరపడుతుంటడంతో ఇంటి సభ్యులలో టెన్షన్ తగ్గించేందుకు ఇలాంటి ఆహ్లాదకరమైన టాస్క్ ఇచ్చారేమో బిగ్ బాస్. కంటెస్టెంట్స్‌లో ఉన్న నటనా ప్రతిభను వెలికితీయడంతో పాటుగా తమ తమ ప్రవర్తనలను సమీక్షించుకునే అవకాశం కల్పించారు బిగ్ బాస్.