మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 17 నవంబరు 2020 (19:22 IST)

అరియానా, అవినాష్‌ల మధ్య పుల్లలు పెట్టిన బిగ్ బాస్..

Bigg Boss 4
బిగ్ బాస్ హౌజ్‌లో ఇప్పటివరకు డ్యూయెట్లు పాడుకున్న మోస్ట్ క్రేజీ కపుల్ అవినాష్, అరియానా ఇప్పుడు గొడవ పడ్డారు. వినడానికి కాస్త విచిత్రంగా అనిపించినా కూడా ఇదే నిజం. ఎందుకంటే అవినాష్ వచ్చిన మూడో వారం నుంచి ఇప్పటి వరకు ఆయనతోనే వెనక తోకల తిరిగింది అరియానా.

అంతే కాదు ప్రతి టాస్క్ లో అవినాష్ కి సపోర్ట్ ఇచ్చింది. ఒక సమయంలో తన కంటే ఎక్కువ ప్రాముఖ్యత అవినాష్ కు ఇచ్చింది అరియానా. అందుకే వీరిద్దరిని చూసి హౌస్ మెట్స్ కూడా ప్యాకేజీ అనేశారు. వీళ్ళిద్దరూ ఎలిమినేట్ అయి విడిపోవడమే తప్ప ఇంట్లో ఉన్నప్పుడు అసలు గొడవ పడరని చాలామంది అభిప్రాయపడ్డారు.
 
కానీ అక్కడ ఉన్నది బిగ్ బాస్.. ఎవరి మధ్యలో అయినా పుల్లలు పెట్టగల సామర్థ్యం ఆయన సొంతం. ఇప్పుడు కూడా ఇదే చేశాడు పెద్దాయన. తాజాగా విడుదలైన ప్రోమోలో అవినాష్, అరియానా గొడవ పడుతూ కనిపించారు. ఇది చూసి చాలా మంది షాక్ అయ్యారు. అక్కడ ఏం జరిగిందో తెలియదు గానీ అవినాష్ ను ఓ విషయంలో బుక్ చేసింది అరియానా. దాంతో మన జబర్దస్త్ కమెడియన్‌కి కోపం ఒక్కసారిగా నషాళానికి అంటింది. అక్కడ నువ్వు చూశావా.. ఏం జరిగిందో తెలియకుండా ఎందుకు మాట్లాడుతున్నావ్.. నన్ను ఎందుకు మధ్యలో ఇరికిస్తున్నావు అంటూ ఫైర్ అయ్యాడు అవినాష్.
 
దానికి అరియానా కూడా అదే స్థాయిలో సమాధానం చెప్పింది. అక్కడ ఏం జరిగిందో నేను చూశాను.. చూసింది చెప్పాను ఇదే నా స్టైల్ అంటూ రెచ్చిపోయింది. దాంతో ఇద్దరి మధ్యలో చిన్న గ్యాప్ వచ్చింది. మరి మొత్తం ఎపిసోడ్ చూస్తే ఏం జరిగిందో క్లారిటీ వస్తుంది. ఏదేమైనా కూడా అవినాష్, అరియనా మధ్య మాత్రం సక్సెస్ ఫుల్‌గా గొడవ పెట్టగలిగాడు బిగ్ బాస్.