రూ.50 లక్షలను గెలుచుకుంటే ఏం చేస్తానంటే?: ప్రియాంక
బిగ్ బాస్ ఏడో సీజన్ ప్రియాంక మొదటి నుంచి కూడా చాలా యాక్టివ్‌గా దూసుకుపోతోంది. ప్రస్తుతం టాప్ 5 సభ్యుల లిస్టులో ఆమె పేరు కూడా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రైజ్ మనీగా 50 లక్షలను గెలుచుకుంటే ఏం చేస్తారనే ప్రశ్నకి ఆమె తన మనసులోని మాటను బయటపెట్టింది.
"సార్ .. మా ఫాదర్‌కి ఎలాంటి ప్రాపర్టీ లేదు. ఇల్లుగానీ.. షాప్ గాని లేదు. అటు అమ్మపేరు మీద గానీ .. ఇటు నాన్నపేరు మీద గాని ఎలాంటి ఆస్తులు లేవు గనుక, ఒక ఇల్లు తీసుకుని వాళ్లకి గిఫ్ట్‌గా ఇవ్వాలని అనుకుంటున్నాను" అంటూ నిజాయతీగా సమాధానమిచ్చింది. మరి ఈ సీజన్లో ఆ ప్రైజ్ మనీని ఎవరు అందుకుంటారనేది చూడాలి.