గురువారం, 19 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 24 నవంబరు 2023 (18:08 IST)

బిగ్‌ బాస్‌ తెలుగు 7: కెప్టెన్సీ టాస్క్.. అమర్ దీప్‌కు ఫిట్స్

Amardeep
Amardeep
బిగ్‌ బాస్‌ తెలుగు 7వ సీజన్‌ 12వ వారం నడుస్తుంది. హౌజ్‌లో ఈ వారం మాత్రమే కెప్టెన్‌ అయ్యే ఛాన్స్ ఉందని మొన్న హోస్ట్ నాగ్‌ చెప్పారు. హౌజ్‌లో కెప్టెన్సీ టాస్క్ జరుగుతుంది. అయితే చివరగా పెద్ద ట్విస్ట్ చోటు చేసుకుందట. అసలు కెప్టెనే లేకుండా అయిపోయిందట. 
 
కెప్టెన్సీ టాస్క్‌లో చివరగా అర్జున్‌, అమర్‌ దీప్‌ ఉన్నారు. వారికి శివాజీ, శోభా శెట్టి సపోర్ట్ చేసే అవకాశం లభించింది. అయితే ఈ ఇద్దరు ఎవరికి సపోర్ట్ చేస్తే వాళ్లు కెప్టెన్‌ అవుతారు. అందుకే శివాజీ అమర్‌కి సపోర్ట్ చేయలేదు. 
 
తాజాగా దీనికి సంబంధించిన ప్రోమో విడుదలైంది. ఇందులో తనకు అవకాశం ఇవ్వండి అన్నా అంటూ అమర్‌ దీప్‌ వేడుకున్నాడు. రిక్వెస్ట్ చేశాడు. కానీ శివాజీ ససేమిరా అన్నాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఎంత బతిమాలుకున్నా శివాజీ వినలేదు. దీంతో ఈ వారం అసలు కెప్టెన్‌ లేడని ప్రకటించినట్టు తెలుస్తుంది. మరి కెప్టెన్ వ్యవహారం ఏంటో శనివారం తేలనుంది. 
 
అయితే ఈవారం కెప్టెన్సీ టాస్క్‌లో పోలీస్ ఆఫీసర్‌గా ఫుల్ ఫన్‌ని జనరేట్ చేస్తూ అదరగొడుతున్నాడు. ఈ నేపథ్యంలో అమర్ దీప్‌కి అనారోగ్యం, క్షీణించిన ఆరోగ్యం, ఫిట్స్ వచ్చి పడిపోయాడంటూ వార్తలు బయటకు వచ్చాయి. నిజానికి అమర్ దీప్.. బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లేప్పుడు కూడా అనారోగ్యంతోనే ఉన్నాడు.