గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 21 అక్టోబరు 2023 (16:21 IST)

శివాజీ భావోద్వేగం.. చేతికట్టుకు గాయం.. ఇంటి నుంచి వెళ్లిపోతున్నాడా?

Shivaji
Shivaji
బిగ్ బాస్ షోలో ఒక వారంలో టాస్క్ జరుగుతున్న సమయంలో శివాజి కింద పడ్డాడు. దీంతో అతడి భుజానికి గాయమైన సంగతి తెలిసిందే. అందుకే అతడిని స్కానింగ్ కోసం బయటకు పంపించి.. వైద్య పరీక్షల అనంతరం లోపలికి తీసుకు వచ్చారు. 
 
అప్పటి నుంచి బిగ్ బాస్ కూడా అతడిని టాస్కులకు దూరంగానే ఉంచుతున్నా.. తనదైన రీతిలో మెప్పిస్తూనే వెళ్తున్నాడు. ఆరంభం నుంచే శివాజి టైటిల్ ఫేవరెట్ అనిపించుకున్నాడు. ఆటతీరుతో పాటు బ్రెయిన్‌కు పని చెప్తూ సత్తా చాటుతున్నాడు. 
 
దీంతో క్రమంగా క్రేజ్ పెంచుకుంటోన్నాడు. తాజాగా ఇందులో టాప్ కంటెస్టెంట్‌గా ఉన్న శివాజి షో నుంచి తప్పుకుంటున్నాడు. ఏడో వారంలో శివాజిపై కంటెస్టెంట్లు వ్యతిరేకత వ్యక్తపరుస్తూనే ఉన్నారు. తనను కెప్టెన్సీ కంటెడర్ల రేసు నుంచి తప్పించడంతో శివాజి ఎంతగానో బాధపడ్డాడు. 
 
మైక్ తీసేసి మరీ "నేను వెళ్లిపోతా బిగ్ బాస్. నన్ను పంపించు" అంటూ గొడవ చేశాడు. తర్వాత కన్‌ఫెషన్ రూమ్‌కు వెళ్లిన శివాజి ఏడుస్తూ తన బాధను బిగ్ బాస్‌తో పంచుకున్నాడు. అందరూ తనను అంటుంటే తట్టుకోలేకపోతున్నానని, వాళ్ల మాటల్లోనూ నిజం ఉందని ఎమోషనల్ అయ్యాడు. 
 
చేయి గాయంతో ఇబ్బంది పడుతున్నానని శివాజీ చెప్పడంతో.. బిగ్ బాస్ 'శివాజి.. మీకు మరోసారి డాకర్లు వైద్య పరీక్షలు చేస్తారు. వాళ్లు మీ పరిస్థితిపై అవగాహనకు వచ్చి పంపించమంటే.. మిమ్మల్ని హౌస్ నుంచి పంపిస్తాము' అని ప్రకటించాడు. దీంతో శివాజి ఫ్యాన్స్ షాక్ అయ్యారు. నిజంగానే అతడు బయటకు వస్తాడా అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.