ఫైనల్ స్టేజీకి బిగ్ బాస్ ఐదో సీజన్.. ప్రమోషన్స్‌లో సెలెబ్రిటీలు

శనివారం, 4 డిశెంబరు 2021 (10:49 IST)
బిగ్‌బాస్ ఐదో సీజన్ ఫైనల్ స్టేజీకి వచ్చింది. ఫైనల్‌కి కంటెస్టెంట్ గాయకుడు శ్రీరామ్ గెలుచుకున్నాడు. అన్ని రౌండ్లలో గెలిచి ఫైనల్‌కు తన స్థానాన్ని ఖాయం చేసుకున్నాడు. అయితే ఈ వారం ఎలిమినేట్ అయితే ఆయన ముందుకు వెళ్లలేడు. 
 
మరోవైపు శ్రీరామ్‌ ఫైనల్స్‌కు చేరుకోవడంతో ఆయన అభిమానులు చాలా సంతోషంగా ఉన్నారు. అధికారిక ఓటింగ్ పోల్స్ లో శ్రీరామ చంద్ర, సన్నీ మంచి ఓటింగ్‌ను సంపాదించారు. అయితే సిరి, మానస్ ఒకే విధమైన ఓటింగ్ శాతాన్ని కలిగి ఉండగా. ఎలిమినేషన్స్‌లో కాజల్, ప్రియాంక సింగ్‌లు డేంజర్ జోన్‌లో ఉన్నారు.
 
బిగ్ బాస్ చివరి దశకు రావడంతో కంటెస్టెంస్ట్ అంతా కూడా వేరే సెలబ్రిటీలతో ప్రమోషన్స్ చేయిస్తున్నారు. సోషల్ మీడియాలో బిగ్ బాస్ ప్రమోషన్స్ పీక్స్ లో ఉన్నాయి. తాజాగా బిగ్ బాస్ కంటెస్టెంట్స్ మానస్ కి సపోర్ట్ గా టీవీ, సినీ ఆర్టిస్టులు ప్రమోషన్ చేస్తున్నారు. ఇప్పటికే సింగర్‌ మధుప్రియ, నోయెల్, నటాషా, అదిరే అభి, పూర్ణ, క్యారెక్టర్ ఆర్టిస్ట్ సన, టీవీ ఆర్టిస్ట్ సమీరాతో పాటు మరి కొంత మంది ప్రముఖులు మానస్ కి ఓటు వేయండి అంటూ వీడియోలు పోస్ట్ చేస్తున్నారు. 
 
తాజాగా హీరోయిన్ మాళవిక శర్మ కూడా మానస్‌కి వోట్ వేయండి అంటూ వీడియో పోస్ట్ చేసింది. వీరితో పాటు మాజీ బిగ్ బాస్ విన్నర్ కౌశల్ కూడా మానస్‌కి సపోర్ట్ చేస్తూ వీడియో షేర్ చేశాడు. చివరి దశకి రావడంతో మానస్ తరపున సోషల్ మీడియాలో ప్రమోషన్స్ లో దూకుడు చూపిస్తున్నారు. .

అన్నీ చూడండి

జీవవైవిధ్య దినోత్సవం: ఐటీసీ మడ అడవుల సంరక్షణ ద్వారా తీరప్రాంత పర్యావరణ వ్యవస్థ బలోపేతం

త్వరలోనే ఏఐ ఆధారిత వైద్య సేవలు.. చంద్రబాబు నాయుడు

వైకాపా ముమ్మాటికి గొడ్డలి పార్టీనే .. 11 అరాచకాలు ఇవిగోండి : సీఎం చంద్రబాబు ధ్వజం

అయ్యా సీఎం విజయ్ నీ ఉచిత కరెంట్ మాకొద్దు, డబ్బులిస్తాం ఇవ్వు నాయనా: తమిళనాడులో మొదలైన అసంతృప్తి, వీడియో

తెలంగాణలో తీవ్ర వడగాలులు-16మంది మృతి: పొంగులేటి శ్రీనివాస రెడ్డి

అన్నీ చూడండి

మండుటెండలో నుంచి చల్లటి నీరు తాగితే...

నువ్వుల నూనెతో ప్రయోజనాలు ఏమిటి?

మెంతి ఆకుల పేస్టుతో ఆరోగ్య ప్రయోజనాలు, ఏంటవి?

పార్కిన్సన్స్ నియంత్రణలో డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ కీలక చికిత్స: మెడికవర్ వైద్యులు

డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ నుంచి నోటి ద్వారా తీసుకునే సెమాగ్లుటైడ్ బయోసిమిలర్ ఒబెడా టాబ్లెట్లు

తర్వాతి కథనం
Show comments