మంగళవారం, 10 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : గురువారం, 30 జూన్ 2022 (13:27 IST)

మైక్ టైస‌న్‌కు బ‌ర్త్ డే గిఫ్ట్‌- రిప్ల‌యి ఇచ్చిన టైస‌న్‌

Liger poster
Liger poster
ఈరోజు అన‌గా శుక్ర‌వారంనాడు మైక్ టైస‌న్‌కు బ‌ర్త్ డే గిఫ్ట్ ఇచ్చింది `లైగ‌ర్‌`టీమ్‌. చిత్ర యూనిట్ ఆయ‌న‌కు గ్రీటింగ్స్ చెబుతూ ఓ చిన్న‌వీడియోను విడుద‌ల చేసింది. `ఐ మిస్ యు.. ఐ యామ్ ఇన్ ఇండియా..` అంటూ విజ‌య్ దేవ‌ర‌కొండ విషెస్‌తోపు, క‌ర‌ణ్ జోహార్ శుభాకాంక్ష‌లు కూడా ఇందులో వున్నాయి. పూరి జగన్నాథ్ తెరకెక్కిస్తున్న లేటెస్ట్ భారీ పాన్ ఇండియన్ చిత్రం “లైగర్”.  పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు చురుగ్గా సాగుతున్నాయి. ఇందులో బాక్సింగ్ స‌న్నివేశాల‌కోసం విదేశీ బాక్స‌ర్స్ ఫైట‌ర్లు పాల్గొన్నారు.
 
అనన్య పాండే సహా ఛార్మీలు కూడా విషెస్ చెప్పారు. ఈ వీడియోను చూశాక టైస‌న్ రిప్ల‌యి ఇస్తూ, ఫ్ల‌యింగ్ కిస్ ఇస్తూ షేర్ చేశాడు. కాగా, ఇటీవ‌లే ఇందులో విల‌న్‌గా న‌టిస్తున్న విషురెడ్డి బాక్సింగ్ ఫొటోను చార్మి కౌర్ విడుద‌ల‌చేసింది. త్వ‌ర‌లో ఈ సినిమాను విడుద‌ల చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు. ప్ర‌స్తుతం విజ‌య్ దేవ‌ర‌కొండ జ‌గ‌న‌గ‌మ‌ణ సినిమా షూట్లో వున్నారు. కాశ్మీర్ నేప‌థ్యంలో ఈ చిత్రం సాగుతుంది.