ఆదివారం, 12 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 11 ఫిబ్రవరి 2022 (21:20 IST)

తండ్రికి అంత్యక్రియలు జరిపిన స్టార్ హీరోయిన్ రవీనా టాండన్

Raveena
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ రవీనా టాండన్ తండ్రి, ప్రముఖ రచయిత, దర్శకనిర్మాత రవి టాండన్ (85) కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా శ్వాసకోశ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న ఆయన శుక్రవారం ముంబై హాస్పిటల్లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. దీంతో ఒక్కసారిగా బాలీవుడ్ లో విషాద ఛాయలు అలముకున్నాయి. తండ్రి దహన సంస్కారాలను రవీనా టాండన్ పూర్తి చేసింది. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది.
 
అంతేగాకుండా ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఇక తండ్రి మృతిఫై ఆమె సోషల్ మీడియాలో భావోద్వేగానికి గురైంది. "ప్రతి క్షణం నువ్వు నాతోనే ఉంటావు నన్ను, నువ్వే దగ్గరుండి అడుగు వేయిస్తావ్" అంటూ కన్నీటి పర్యంతమైంది. రవి టాండన్ మృతి పట్ల బాలీవుడ్ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. 
Raveena
 
1963లో సునీల్ దత్ నిర్మాణంలో 'యే రాస్తే హై ప్యార్ కే'తో ప్రారంభమైన తన కెరీర్‌లో టాండన్ పరిశ్రమలోని ప్రముఖ తారలతో 'ఖేల్ ఖేల్ మే,' 'అన్హోనీ వంటి అనేక హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించాడు. ,' 'నజరానా,' 'మజ్బూర్,' 'ఖుద్-దార్' మరియు 'జిందగీ వంటి హిట్ సినిమాలు ఆయన ఖాతాలో వున్నాయి.