బాలీవుడ్ సీనియర్ నటుడు రమేశ్ డియో మృతి
బాలీవుడ్ సీనియర్ నటుడు రమేశ్ డియో(93) మృతి చెందారు. హిందీతో పాటు హిందీ, మరాఠీ చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రమేశ్ డియో.. బుధవారం రాత్రి అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన భార్య సీమ కూడా ఓ నటి. వీరి కుమారుల్లో ఒకరైన అజింక్యా హిందీ, మరాఠీ చిత్రాలలో పేరున్న నటుడు. మరో కుమారుడు అభినయ్ దర్శకత్వ శాఖలో పని చేస్తున్నాడు.
ఈ నేపథ్యంలో గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న రమేశ్ డియో గుండెపోటు కారణంగా ఆయన మరణించారు. రమేష్ డియో మరణవార్త తెలిసి పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
1926 సంవత్సరం జనవరి 30వ తేదీ మహారాష్ట్రలోని అమరావతిలో జన్మించిన రమేశ్ డియో.. ఐదు దశబ్దాల పాటు సినీ కెరీర్ కొనసాగించారు. హిందీ, మరాఠీలోని పలు చిత్రాలలో నటించారు. సుమారు 250 సినిమాల్లో నటించిన ఆయన నిర్మాతగా, దర్శకుడిగా కూడా పని చేశారు.
''ఆనంద్, మేరే ఆప్నే, జాలీ ఎల్‌ఎల్‌బీ, ఘాయల్ వన్స్ ఎగైన్'' ఆయనకు మంచి పేరు సంపాదించి పెట్టాయి. 2013లో 11వ పుణె ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్‌లో లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు లభించింది.