మంగళవారం, 18 ఫిబ్రవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : బుధవారం, 19 డిశెంబరు 2018 (17:07 IST)

కెమెరా యాంగిల్స్ - లెన్స్‌లతో అలా చూపిస్తారంతే : ఐటమ్ సాంగ్స్‌పై కత్రినా కైఫ్

ఇటీవలికాలంలో ఐటమ్ సాంగ్‌లలో అందాలు ఆరబోసే హీరోయిన్ల సంఖ్య పెరిగిపోతోంది. బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ ఇలా ఏ చిత్ర పరిశ్రమను తీసుకున్నప్పటికీ ఐటమ్ సాంగ్‌లకు హీరోయిన్లు ఓకే చెప్పేస్తున్నారు. ఈ తరహా పాటలపై బాలీవుడ్ నటి కత్రినా కైఫ్ స్పందించారు. 
 
హీరోయిన్లు ఒకరటిరెండు చిత్రాల్లో ఐటమ్ సాంగ్‌లలో నటించినంత మాత్రాన హీరో స్థాయి తగ్గిపోదన్నారు. అలాగే, ఐటమ్ సాంగ్‌లలో నటించినంత మాత్రాన ప్రేక్షకుల దృష్టిలో మార్కెట్‌లో వస్తువుగా మారిపోదని చెప్పింది. 
 
కెమెరా యాంగిల్స్, లెన్స్ కారణంగానే హీరోయిన్ను ఐటమ్ సాంగ్‌లో హాట్‌గా చూపిస్తారని చెప్పారు. దీనివల్ల ఐటమ్ గర్ల్స్ గౌరవానికి విలువకి వచ్చి ఢోకా ఏం లేదని ఆమె చెప్పుకొచ్చింది. 
 
అంటే, రసిక ప్రేక్షకుల్ని మురిపించే పాటలు చేస్తే సదరు గ్లామరస్ బ్యూటీ దిగజారిపోయినట్టేం కాదని తీర్మానించేసింది. పనిలోపనిగా తనకైతే ఐటెం పాటలకి స్టెప్పులేస్తుంటే ఏ ఇబ్బంది ఉండదని షాకిచ్చింది.