శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By srinivas
Last Modified: సోమవారం, 17 సెప్టెంబరు 2018 (16:03 IST)

'స‌వ్య‌సాచి' స్పెష‌ల్ సాంగ్‌లో త‌మ‌న్నా చేయనందా? కుదర్లేదా?

అక్కినేని నాగ‌చైత‌న్య - ప్రేమ‌మ్ ఫేమ్ చందు మొండేటి కాంబినేష‌న్లో రూపొందుతోన్న యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్ స‌వ్య‌సాచి. మైత్రీ మూవీ మేక‌ర్స్ సంస్థ ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తోన్న ఈ సినిమా స‌మ్మ‌ర్‌లో ప్రేక్ష‌కుల ముందుకు రావాలి కానీ.. గ్రాఫిక్స్ వ‌ర్క్ కంప్ల

అక్కినేని నాగ‌చైత‌న్య - ప్రేమ‌మ్ ఫేమ్ చందు మొండేటి కాంబినేష‌న్లో రూపొందుతోన్న యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్ స‌వ్య‌సాచి. మైత్రీ మూవీ మేక‌ర్స్ సంస్థ ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తోన్న ఈ సినిమా స‌మ్మ‌ర్‌లో ప్రేక్ష‌కుల ముందుకు రావాలి కానీ.. గ్రాఫిక్స్ వ‌ర్క్ కంప్లీట్ కాక‌పోవ‌డం వ‌ల‌న రాలేదు. ఇందులో చైత‌న్య స‌ర‌స‌న నిధి అగ‌ర్వాల్ న‌టించింది. మాధ‌వ‌న్, భూమిక కీల‌క పాత్ర‌లు పోషించారు. ఇదిలాఉంటే... ఈ చిత్రంలో ఓ స్పెష‌ల్ సాంగ్ ఉంది. ఈ సాంగ్‌ను నాగ‌చైత‌న్య‌, త‌మ‌న్నాలపై చిత్రీక‌రించ‌నున్నారు అని వార్త‌లు వ‌చ్చిన విష‌యం తెలిసిందే.
 
అల్ల‌రి అల్లుడు సినిమాలో నాగార్జున‌, ర‌మ్య‌కృష్ణల‌పై చిత్రీక‌రించిన నిన్ను రోడ్డు మీద చూసిన‌ది ల‌గాయితు.. అనే సాంగ్‌ను రీమీక్స్ చేసి స్పెష‌ల్ సాంగ్‌గా ఈ మూవీలో పెట్టాల‌నుకున్నారు. చైతు, త‌మ‌న్నాల‌పై చిత్రీక‌రించాల‌నుకున్నారు. అయితే... శైల‌జారెడ్డి అల్లుడు ఆగ‌ష్టు 31 రిలీజ్ కావాల్సింది. సెప్టెంబ‌ర్ 13న రిలీజ్ చేయాల్సి వ‌చ్చింది. అందుచేత ఈ స్పెష‌ల్ సాంగ్ షూట్ వాయిదా ప‌డింది. 
 
త‌మ‌న్నా డేట్స్ ప్ర‌జెంట్ ఖాళీ లేవు. అందుచేత చైతు, నిధి అగ‌ర్వాల్ పైనే ఈ పాట‌ను చిత్రీక‌రిస్తున్నార‌ని స‌మాచారం. ప్ర‌స్తుతం అన్న‌పూర్ణ స్టూడియోలో ఈ పాట‌ను చిత్రీక‌రిస్తున్నారు. ఈ యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్ స‌వ్య‌సాచిని న‌వంబ‌ర్ 2న రిలీజ్ చేయ‌నున్న‌ట్టు స‌మాచారం.