సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 9 ఆగస్టు 2022 (16:18 IST)

బాంబే వెల్వెట్ నటుడు ప్రదీప్ పట్వర్ధన్ మృతి

eknath shinde
మరాఠీ చిత్ర పరిశ్రమకు చెందిన లెజెండరి యాక్టర్‌ ప్రదీప్‌ పట్వర్ధన్‌ హఠాన్మరణం చెందారు. మంగళవారం నాడు ముంబైలోని తన సొంత నివాసంలో గుండెపోటుతో ప్రదీప్ పట్వర్ధన్‌ మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. దీంతో మరాఠీ చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. ఇతని మృతికి మహరాష్ట్ర సీఎం ఏక్‌నాథ్‌ షిండే సంతాపం తెలిపారు.  
 
"గొప్ప నటుడు హఠాన్మరణం చెందడం నన్ను తీవ్రంగా కలిచివేస్తోంది. మరాఠి సినీ పరిశ్రమ ఓ లెజెండరి నటుడిని కొల్పోయింది" అంటూ ట్వీట్ చేశారు. ప్రదీప్‌ పట్వర్థన్‌ 'ఎక్‌ ఫుల్‌ ఛార్‌ హాఫ్‌', 'డాన్స్‌ పార్టీ', 'మే శివాజీరాజీ భోంస్లే బోల్తె' వంటి మరాఠి సినిమాలతో మంచి క్రేజ్ ను సంపాదించుకున్నారు. 
 
ఇటీవల ఆయన అనురాగ్‌ కశ్యప్‌ 'బాంబే వెల్వెట్‌' క్రైం థ్రిల్లర్‌ మూవీలో కూడా నటించారు. అంతేకాకుండా కొన్ని మరాఠి టీవీ సీరియల్స్‌లో కూడా ఆయన నటించారు.