కాశీలో బ్రహ్మాస్త్ర షూటింగ్ ముగిసింది
అమితాబ్ బచ్చన్, రణబీర్ కపూర్, అలియా భట్, మౌని రాయ్,నాగార్జున అక్కినేని నటిస్తున్న చిత్రం `బ్రహ్మాస్త్ర`. ఆమధ్య నాగార్జున ఎపిసోడ్ చిత్రీకరణ పూర్తయింది. అయాన్ ముఖర్జీ రచన మరియు దర్శకత్వం వహించారు. కరణ్ జోహార్ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన వివరాలను చిత్ర యూనిట్ సోషల్‌మీడియాలో పోస్ట్ చేసింది.
ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న బ్రహ్మాస్త్ర చిత్రం భారతదేశం ఆధ్యాత్మిక రాజధాని కాశీలో జరిగింది. నేటితో చివరి షూటింగ్ షెడ్యూల్‌ను ముగించింది ఈ చిత్రాన్ని 09.09.2022న థియేటర్లలో విడుదల చేసేందుకు చిత్ర నిర్వాహకులు సన్నాహాలు చేస్తున్నారు.