బుధవారం, 18 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 22 ఫిబ్రవరి 2022 (12:08 IST)

రాధే శ్యామ్ సినిమాకు అమితాబ్ వాయిస్ ఓ\వ‌ర్‌

Bachchan
ప్రభాస్, పూజా హెగ్డే నటించిన రాధే శ్యామ్ సినిమాకు అమితాబ్ బ‌చ్చ‌న్ వాయిస్ ఓవ‌ర్ ఇచ్చాడు. ఈ విష‌యాన్ని చిత్ర యూనిట్ ధృవీక‌రిస్తూ పోస్ట‌ర్ విడుద‌ల చేఇసంది. రాధా కృష్ణ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ  చిత్రాన్ని మార్చి 11, 2022 న గ్రాండ్ రిలీజ్‌కి సిద్ధం చేశారు.
 
ఈ చిత్రానికి బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ తన గాత్రాన్ని అందించారని వారు వెల్లడించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు రాధే శ్యామ్ మేకర్స్ ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేశారు. గమనించదగ్గ విషయం ఏమిటంటే, నాగ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ తదుపరి ప్రాజెక్ట్ K లో బిగ్ బి కీలక పాత్ర పోషిస్తున్నారు. యువి క్రియేషన్స్ మరియు టి-సిరీస్ నిర్మిస్తున్న ఈ పీరియాడికల్ రొమాంటిక్ డ్రామాకు డియర్ కామ్రేడ్ ఫేమ్ జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందించారు. తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానున్న ఈ చిత్రానికి మనోజ్ పరమహంస కెమెరాను అందించారు.