శనివారం, 30 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Srinivas
Last Modified: బుధవారం, 27 జూన్ 2018 (14:31 IST)

బిగ్ బాస్ పార్టిసిపెంట్ బాబు గోగినేని పైన కేసు నమోదు..

బిగ్ బాస్ షోలో హల్చల్ చేస్తున్న హేతువాది బాబు గోగినేనిపై మాదాపూర్‌ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. టీవీ చానళ్లు, సోషల్‌ మీడియా ద్వారా బాబు గోగినేని వివిధ మతాల వారి మనోభావాలను కించపరుస్తున్నారని పేర్కొన్నారు. ముఖ్యంగా హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా

బిగ్ బాస్ షోలో హల్చల్ చేస్తున్న హేతువాది బాబు గోగినేనిపై మాదాపూర్‌ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. టీవీ చానళ్లు, సోషల్‌ మీడియా ద్వారా బాబు గోగినేని వివిధ మతాల వారి మనోభావాలను కించపరుస్తున్నారని పేర్కొన్నారు. ముఖ్యంగా  హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా మీడియాలో విమర్శలు చేస్తుండటంతో పాటు తన సమావేశాలకు వచ్చిన జనం నుంచి నిబంధనలకు విరుద్ధంగా ఆధార్‌ కార్డు నెంబర్లను సేకరిస్తున్నారని అతనిపై మాదాపూర్‌కు చెందిన వ్యాపారవేత్త వీరనారాయణ ఫిర్యాదు చేశారు. 
 
హేతువాది, మానవతావాదిగా చెప్పుకొంటున్న గోగినేని ఇటీవల వైజాగ్‌, హైదరాబాద్‌, బెంగళూరుల్లో నిర్వహించిన నేషనల్‌ డే ఆఫ్‌ హ్యూమనిజం పేరుతో పలు సభలు సమావేశాలు ఏర్పాటు చేశారు. సమావేశాలకు వచ్చిన వారి ఆధార్‌ కార్డు నెంబర్లు సేకరించారు. ఇది ప్రభుత్వం యుఐడీఏఐ నిబంధనలకు విరుద్ధమని, బాబు గోగినేనిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదుదారు వీరనారాయణ పేర్కొన్నారు. కోర్టు ఆదేశాల ప్రకారం మాదాపూర్‌ పోలీసులు బాబు గోగినేనిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదుచేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.