శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : గురువారం, 10 మే 2018 (18:34 IST)

నిహారిక కోసం చేపలకూర.. అద్దిరిపోయిందన్నాడు.. ఎవరు?

మెగా హీరోయిన్ నిహారిక కోసం చేపలకూరా? ఎవరు చేశారు? అదిరిందని చెప్పిందెవరు అనే డౌట్ మీలో వుందా..? అయితే ఈ స్టోరీ చదవండి. టాలీవుడ్ అగ్రహీరో రామ్ చరణ్ తేజ్ ప్రస్తుతం రంగస్థలం బంపర్ హిట్‌తో హ్యాపీ హ్యాపీగా

మెగా హీరోయిన్ నిహారిక కోసం చేపలకూరా? ఎవరు చేశారు? అదిరిందని చెప్పిందెవరు అనే డౌట్ మీలో వుందా..? అయితే ఈ స్టోరీ చదవండి. టాలీవుడ్ అగ్రహీరో రామ్ చరణ్ తేజ్ ప్రస్తుతం రంగస్థలం బంపర్ హిట్‌తో హ్యాపీ హ్యాపీగా వున్నాడు. విలేజ్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కిన రంగస్థలం కలెక్షన్ల వర్షం కురిపించడంతో.. తదుపరి సినిమాకు కాస్త గ్యాప్ తీసుకుని ఫ్యామిలీతో గడుపుతున్నాడు. 
 
ఈ సందర్భంగా మెగా హీరోయిన్, తన సోదరి నిహారిక కోసం చెర్రీ స్వయంగా చేపలకూర చేశాడు. అంతేకాకుండా ఆ చేపల కూరను తానే తయారు చేశానని.. టేస్ట్ అదిరిపోయిందని.. టేస్ట్ చూస్తూ చెర్రి చెప్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరోవైపు రామ్ చరణ్ తన తండ్రి మెగాస్టార్ చిరంజీవి 151వ సినిమా సైరా నరసింహా రెడ్డికి నిర్మాణ సారథ్యం వహిస్తున్నాడు.