శనివారం, 30 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 25 మే 2022 (09:44 IST)

రాంగోపాల్ వర్మపై చీటింగ్ కేసు నమోదు.. ఎక్కడ?

ramgopal varma
తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మపై హైదరాబాద్ నగరంలో చీటింగ్ కేసు ఒకటి నమోదైంది. తనకు రూ.56 లక్షల మేరకు మోసం చేశారంటూ ఓ ఫైనాన్షియర్ ఇచ్చిన ఫిర్యాదుతో ఈ కేసు నమోదైంది. మాయమాటలు చెప్పిన తన నుంచి డబ్బులు తీసుకున్నారని, ఈ డబ్బులు కూడా ఆరు నెలలకే ఇచ్చేస్తానని చెప్పి ఇప్పటికీ తిరిగి చెల్లించలేదని తెలిపారు. కోర్టు దావా ఆధారంగా ఆయన ఫిర్యాదు చేయడంతో హైదరాబాద్ మియాపూర్ పోలీసులు వివిధ సెక్షన్ల కింద వర్మపై కేసు నమోదు చేశారు. 
 
కాగా, ఈ ఫైనాన్షియర్ చేసిన ఫిర్యాదులో.. "2019లో నా స్నేహితుడి ద్వారా రాంగోపాల్ వర్మతో పరిచయం ఏర్పడింది. 2020లో దిశ సినిమా కోసం నా నుంచి డబ్బు తీసుకున్నారు. ఆ యేడాది జనవరి నెలలో రూ.8 లక్షలు ఇచ్చారు. ఆ తర్వాత మరోమారు రూ.20 లక్షలు కావాలని వర్మ విజ్ఞప్తి చేయడంతో గత 2020 జనవరి 22వ తేదీన ఆ మొత్తం కూడా సర్దుబాటు చేశారు. 
 
ఆ తర్వాత అదే యేడాది ఫిబ్రవరి రెండో వారంలో ఆర్థిక కష్టాలు ఉన్నాయని చెప్పి మరో రూ.28 లక్షలు తీసుకున్నారు. దిశ నినిమా విడుదలైన రోజు లేదా అంతకంటే ముందే తిరిగిచ్చేస్తానని హామీ ఇవ్వడంతో ఆయన్ను నమ్మి డబ్బులిచ్చాను. కానీ, ఇంతవరకు ఆయన పైసా డబ్బులు ఇవ్వలేదు. వర్మ ఇచ్చిన తప్పుడు హామీలకు మోసపోయానని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తన డబ్బును తిరిగి ఇప్పించాలని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో వర్మపై మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు.