గురువారం, 19 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 24 మే 2022 (10:45 IST)

కొంత‌మంది మాపై క‌క్ష‌క‌ట్టారు - జీవితా రాజశేఖర్

Jeevita Rajasekhar
Jeevita Rajasekhar
రాజశేఖర్ కథానాయకుడిగా ఆయన సతీమణి జీవిత రాజశేఖర్ దర్శకత్వం వహించిన 'శేఖర్' గత శుక్రవారం విడుదలైంది. అయితే, ఫైనాన్షియర్ పరంధామరెడ్డి వేసిన కేసు కారణంగా సినిమా ప్రదర్శన నిలిచిపోయిన సంగతి తెలిసిందే. ఈ వివాదంలో జీవితా రాజశేఖర్, శేఖర్ చిత్రబృందం సభ్యులకు అనుకూలంగా కోర్టులో న్యాయమూర్తి మాట్లాడారు. ఈ విష‌యాల‌ను జీవిత చెబుతూ, కొంత‌మంది మా సినిమాను కావాల‌ని అడ్డుకున్నారు. వారెవ‌రో త్వ‌ర‌లో చెబుతాను అన్నారు.
 
'శేఖర్' సినిమా ప్రదర్శనను నిలిపివేయాలని తామెప్పుడూ చెప్పలేదని న్యాయస్థానం కూడా చెప్పింది.  . కొంతమంది ఉద్దేశపూర్వకంగా సినిమా ప్రదర్శనకు ఆటంకం కలిగించారు. అయితే, కోర్టు సినిమా ప్రదర్శనకు ఎటువంటి అభ్యంతరం తెలపలేదు. శేఖర్ సినిమాను నిరభ్యంతరంగా ప్రదర్శించవచ్చు. జీవితా రాజశేఖర్, నిర్మాత బీరం సుధాకర్ రెడ్డి తరపు న్యాయవాదులు మంగళవారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. మ‌రిన్ని వివ‌రాలు కొద్దిసేప‌టిలో రానున్నాయి.