చిరంజీవి 153వ చిత్రం మ్యూజిక్ సిట్టింగ్స్ మొదలు
మెగాస్టార్ చిరంజీవి రాబోయే చిత్రం `ఆచార్య` విడుదలకి సిద్దంగా ఉంది. దాంతో పాటు చిరంజీవి పైప్‌లైన్‌లో కొన్ని ఎగ్జయిటింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. మెగాస్టార్ చిరంజీవి తన 153 వ చిత్రాన్ని దర్శకుడు మోహన్‌రాజాతో చేయనున్న విషయం తెలిసిందే..మెగాస్టార్ లాంటి బిగ్‌స్టార్‌తో కలిసి పనిచేసే అవకాశం రావడం దర్శకుడు మోహన్ రాజాకి డ్రీమ్ కమ్ ట్రూ మూమెంట్. మెగాస్టార్ ఆచార్య చిత్రం షూటింగ్ పూర్తవగానే ఈ చిత్రం పట్టాలెక్కనుంది.
ఈ చిత్రంకోసం టాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ తమన్ స్వరాలు సమకూరుస్తున్నారు. ఈ రోజు నుండి మ్యూజిక్ సిట్టింగ్స్ ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా దర్శకుడు మోహన్ రాజా, ఎస్ ఎస్ తమన్ కలిసి ఉన్న పోస్టర్ ని సోషల్ మీడియాలో షేర్ చేశారు.
చిరంజీవి మాస్ ఇమేజ్‌ను దృష్టిలో ఉంచుకుని దర్శకుడు మోహన్‌రాజా అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్‌ని జోడించారు. ఈ విషయంలో చిరంజీవి కూడా సంతృప్తి చెందినట్టు తెలుస్తోంది.
మెగాస్టార్ చిరంజీవి 153వ చిత్రం కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, సూపర్‌గుడ్ ఫిలింస్ పతాకాలు సంయుక్తంగా నిర్మిస్తున్నమెగాస్టార్ చిరంజీవి 153వ చిత్రానికి ఆర్ బి చౌదరి, ఎన్వీ ప్రసాద్ నిర్మాతలు.సంగీతం: తమన్.