నా ఫ్రెండ్ రజనీకాంత్ ‘దర్బార్’ సూపర్ డూపర్ హిట్ అవ్వాలి - మెగాస్టార్ చిరంజీవి

chiranjeevi
శ్రీ| Last Modified మంగళవారం, 7 జనవరి 2020 (21:24 IST)
మెగాస్టార్ చిరంజీవి అంటే సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్ కు ఎంతో అభిమానం. అలాగే, రజనీకాంత్ అంటే చిరంజీవికి ఎంతో అభిమానం. ఇద్దరి మధ్య చక్కటి స్నేహం ఉంది. పలు సందర్భాలలో వీరిద్దరి స్నేహాన్ని ప్రేక్షకులు కళ్లారా చూశారు. ‘అత్తకి యముడు అమ్మాయికి మొగుడు’ తమిళ రీమేక్ ‘మాపిళ్ళై’తో పాటు మరికొన్ని చిత్రాల్లో కలిసి నటించారు కూడా!

‘సరిలేరు నీకెవ్వరు‘ ప్రీ రిలీజ్ ఫంక్షన్ సాక్షిగా రజనీపై తన అభిమానాన్ని చిరంజీవి చాటుకున్నారు. “సంక్రాంతికి విడుదల అవుతున్న అన్ని సినిమాలతో పాటు నా ఫ్రెండ్ రజినీకాంత్ ‘దర్బార్’ సూపర్ హిట్ అవ్వాలని చిరంజీవి అన్నారు. సినిమాలు అన్ని విజయాలు సాధించి దర్శకులకు పేరు, నిర్మాతలకు డబ్బులు తీసుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు ఆయన అన్నారు.

సూపర్ స్టార్ రజనీకాంత్ కథానాయకుడిగా ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్ పతాకంపై భారీ నిర్మాణ వ్యయంతో, అత్యున్నత సాంకేతిక విలువలతో ఎ. సుభాస్కరన్‌ నిర్మించిన చిత్రం ‘దర్బార్’. తెలుగులో ప్రముఖ నిర్మాత ఎన్వీ ప్రసాద్‌ విడుదల చేస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 9న సినిమా ప్రేక్షకుల ముందుకొస్తోంది.

ఆల్రెడీ రిలీజైన ఈ సినిమా ట్రైలర్ రికార్డులు సృష్టోస్తోంది. ముఖ్యంగా పోలీస్‌ ఆఫీసర్‌గా రజనీకాంత్‌ స్టైల్, గ్రేస్ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటోంది. ఆయనను దర్శకుడు మురుగదాస్ చాలా స్టయిలిష్‌గా చూపించారని అభిమానులు సంబరపడుతున్నారు. ట్రైలర్‌లో ‘సార్‌! వాళ్ళకు చెప్పండి… పోలీసుల దగ్గరకు లెఫ్ట్‌లో రావొచ్చు. రైట్‌లో రావొచ్చు.

స్ట్రైయిట్‌గా రావొద్దని’, ‘ఆ చూపేంటి? ఒరిజినల్‌గానే విలన్‌ అమ్మా! ఇది ఎలా ఉంది?’, ‘అయామ్‌ ఎ బ్యాడ్‌ కాప్‌’ అని రజనీకాంత్‌ చెప్పిన డైలాగులకు సూపర్ రెస్పాన్స్ లభిస్తోంది. ట్రైలర్‌లో రజనీకాంత్ మేనరిజమ్స్, యాక్టింగ్, స్టైల్, మురుగదాస్ టేకింగ్ సినిమాపై అంచనాలు పెంచేశాయి.దీనిపై మరింత చదవండి :